Cheapest Recharge Plans: మీరు ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ అయితే ప్రతి నెలా మనకి రీఛార్జ్ టెన్షన్ అనేది ఉంటుంది. ప్రతి నెల రీఛార్జ్ చేస్తూ ఉంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే టెలికాం కంపెనీలు సడెన్‌గా రీఛార్జ్ రేట్లు పెంచేస్తే మీరు చెల్లించాల్సిన డబ్బులు పెరిగిపోతాయి. భారతదేశంలోని మూడు పెద్ద టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కొన్ని అద్భుతమైన ఇయర్లీ ప్లాన్లు అందిస్తున్నాయి. వీటితో రీఛార్జ్ చేసుకుంటే మీరు సంవత్సరం మొత్తం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
అంతే కాకుండా ఈ ప్లాన్‌లు నెలవారీ ప్లాన్‌ల కంటే చాలా చవకగా ఉంటాయి. ఇది కాకుండా రీఛార్జ్ ప్లాన్ల ధరలు మధ్యలో పెరిగినా... అది మీ ప్లాన్‌పై ప్రభావం చూపదు. ఈ ప్లాన్లు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో వార్షిక ప్లాన్ (Reliance Jio Rs 3599 Plan)
జియో చవకైన వార్షిక ప్లాన్ ధర రూ. 3,599గా ఉంది. దీని వాలిడిటీ మొత్తం 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2.5 జీబీ డేటాను పొందుతారు. అంటే ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం 912.5 GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ప్రతిరోజూ అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని పొందవచ్చు. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సభ్యత్వం కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా వినియోగదారులు జియో ట్రూ5జీ అంటే అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌కు అయ్యే నెలవారీగా మారిస్తే దాదాపు రూ.276 అవుతుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
భారతీ ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ (Airtel Rs 1999 Plan)
ఎయిర్‌టెల్ చవకైన వార్షిక ప్లాన్ రూ. 1,999గా ఉంది. ఇది జియె అందించే వార్షిక ప్లాన్ కంటే చాలా చవకైనది. అయితే వినియోగదారులు ఈ ప్లాన్‌తో లిమిటెడ్ డేటాను మాత్రమే పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంది. అయితే ఇది మొత్తంగా 24 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఇది కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, స్పామ్ ఫైటింగ్ నెట్‌వర్క్, అపోలో 24*7 సర్కిల్, వింక్ మ్యూజిక్ ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.
వొడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్ (Vodafone Idea Rs 3499 Plan)
వొడాఫోన్ ఐడియా చవకైన వార్షిక ప్లాన్ రూ. 3,499గా ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ఈ ప్లాన్‌తో బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సౌకర్యాన్ని పొందుతారు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే