WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. చాట్ జీపీటీలో మెటా ఏఐ కన్నా పవర్ ఫుల్ ఫీచర్లు

WhatsApp : ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త టెక్నాలజీలు కూడా యాడ్ అవుతున్నాయి.

Continues below advertisement

WhatsApp : ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త టెక్నాలజీలు కూడా యాడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించే చర్చ. ఏఐలో తొలిసారి విప్లవంలా దూసుకొచ్చింది చాట్‌ జీపీటీ. గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థ భయపడే పరిస్థితి వచ్చిందంటేనే చాట్ జీపీటీ రేంజ్‌ ఏంటో ఓ సారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాట్‌ జీపీటీ టెక్‌ ప్రపంచాన్ని షేక్‌ చేసింది. అయితే ఈ చాట్‌ జీపీటీని వాట్సాప్‌లో కూడా ఉపయోగించుకునే అవకాశం వచ్చేసింది. 

Continues below advertisement

నిన్న మొన్నటి వరకు ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా గూగుల్ లో వెతికే వారు.  కానీ ప్రస్తుతం చాట్‌ జీపీటీనే ఆశ్రయిస్తున్నారు.  ఒక ప్రశ్నకు గూగుల్‌ వంద రకాల సమాధానాలు చెప్తుంది. అయితే చాట్‌ జీపీటీ మాత్రం మీ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం అది కూడా కరెక్టుగా చెబుతుంది.  అందుకే ఈ చాట్‌బాట్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ దక్కింది.  ఒక మనిషితో మనం చాట్‌ చేస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఉంటుంది చాట్‌ జీపీటీతో.  

Also Read : Hidden Charges: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బ్లింకిట్‌ వంటి హోమ్‌ డెలివెరీ ఫ్లాట్‌ఫామ్స్‌లో "హిడెన్‌ ఛార్జీలు" - ఇదో ఘరానా మోసం

ప్రస్తుతం అలాంటి ఛాన్స్ వాట్సాప్ లో వచ్చింది.  సింపుల్‌గా ఒక క్లిక్‌తో చాట్‌ జీపీటీతో మాట్లాడుకోవచ్చు.. మీకు నచ్చిన క్వశ్చన్స్ అడగొచ్చు.  ఇంతకీ వాట్సాప్‌లో చాట్‌ జీపీటీ సేవలను ఎలా పొందాలో తెలుసుకుందాం.   ఈ కింది స్టెప్స్‌ ఫాలో అవ్వండి.. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో +1 800 242 8478 నంబర్ ను సేవ్‌ చేసుకోవాలి.  మనం నెంబర్‌ సేవ్‌ చేసుకునే సమయంలో +91 వస్తుంది. అయితే నెంబర్ సేవ్‌ చేసే ముందు +1ని టైప్‌ చేయడం మర్చిపోవద్దు.  ఆ తర్వాత వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి ఏ పేరుతో అయితే జీపీటీ నెంబర్‌ను సేవ్ చేసుకున్నారో ఆ చాట్‌బాక్స్‌ను ఓపెన్‌ చేయాలి. అంతే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా  ఒక మెసేజ్‌తో తీర్చుకోవచ్చు.

ఓపెన్‌ఏఐ తాజాగా వాట్సాప్ పై చాట్ జీపీటీ చాట్‌బాట్‌కు కొత్త అప్డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఇప్పుడు ఈ ఏఐ చాట్‌బాట్ మెటా ఏఐ కంటే మరింత శక్తివంతమైన, ఉపయోగకరమైన  సేవలను అందిస్తోంది. ఇప్పుడు వినియోగదారులు చాట్ జీపీటీ ద్వారా వాయిస్ మెసేజీలు, ఆడియో ఫైల్స్, ఫోటోలు అర్థం చేసుకుని వాటిపై ప్రశ్నలు అడగవచ్చు.

Also Read : Everest : ఎవరెస్ట్ శిఖర అధిరోహకులకు షాక్.. ఇకపై ఎవరు పడితే వాళ్లు వెళ్లడానికి వీల్లేదంటున్న నేపాల్

కొత్త అప్డేట్ లో ఏం ఉంది?
ఓపెన్‌ ఏఐ ఈ కొత్త అప్డేట్ ద్వారా చాట్ జీపీటీని WhatsApp లో మరింత ఉపయోగకరంగా తయారుచేసింది. ఈ అప్డేట్‎తో వినియోగదారులు వాయిస్, ఆడియో ఫైల్స్, ఫోటోలను షేర్ చేయగలుగుతున్నారు. చాట్ జీపీటీ వాటిని అర్థం చేసుకుని వాటిపై సమాధానాలు ఇస్తుంది. అయితే, ఈ చాట్‌బాట్ ఫోటోలు, ఆడియోపై స్పందించదు. అది కేవలం టెక్స్ట్ మెసేజీలకు మాత్రమే సమాధానం ఇస్తుంది.

 ఓపెన్‌ఏఐ త్వరలో ChatGPT వినియోగదారులకు WhatsApp ద్వారా వారి ప్రత్యేక ChatGPT ఖాతాలను యాక్సెస్ చేయగలిగేలా చేయనుంది. దీనివల్ల వినియోగదారులకు చాట్‌బాట్ తో మరింత సులభంగా కన్వర్జేషన్ కొనసాగించడానికి, ChatGPT యాప్ నుండి ఇన్ఫర్మేషన్ సింక్రనైజ్ చేసేందుకు వీలు పడుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మెసేజ్ లను మరింత సులభంగా, పంపగలుగుతారు.    ఇంకా ఓపెన్‌ఏఐ తన ChatGPT లో "డీప్ రీసెర్చ్" ఆఫ్షన్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మరింత కష్టమైన పనులకు ఆన్‌లైన్ రీసెర్చ్ మొదలు పెడతారు. ఇది మరింత క్లిష్టమైన అంశాలపై పరిశోధన చేయడానికి మరింత సహాయం అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు చాలా స్టెప్పులపై ఆన్‌లైన్ రీసెర్చ్ చేయగలుగుతారు.

Continues below advertisement