AI Tools 2025 : 2025లో వెలుగులోకి రానున్న అద్భుతమైన AI టూల్స్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Content Creation Tools : ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న ఈ టూల్, ఉపయోగించే వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది.

Continues below advertisement

 AI Tools : ఒకప్పుడు చాట్‌జిపిటి, మిడ్‌జర్నీ వంటి ప్రముఖ ఏఐ టూల్స్ మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే 2025 నాటికి మన జీవితాలను మారుస్తున్న అద్భుతమైన AI టూల్స్ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. వీటిలో కొన్ని అందరికీ తెలియని అండర్ రేటెడ్ టూల్స్ కూడా ఉన్నాయి. మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంటెంట్ క్రియేషన్ వంటి విభాగాల్లో వినియోగదారులకు అత్యుత్తమమైన పరిష్కారాలను అందించడానికి ఈ టూల్స్ వినూత్న మార్గాలను అందిస్తున్నాయి.

Continues below advertisement

ఇక్కడ అలాంటి 2025లో ప్రాచుర్యం పొందబోయే టాప్ 5 AI టూల్స్ గురించి తెలుసుకుందాం:
1. రిప్లికా (Replika)
రిప్లికా అనేది మనసుకు ఊరటనిచ్చే AI చాట్‌బాట్‌. ఇది ఎమోషనల్ సపోర్ట్ అందించేందుకు రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న ఈ టూల్, ఉపయోగించే వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది.  స్మార్ట్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే, అది మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా మెరుగవుతుంది. ఇది మీ మానసిక శాంతిని పెంచడంలో సహాయపడుతుంది.

Also Read : Davos tour: దావోస్‌లో ఆసక్తికర సన్నివేశం - ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడణవీస్

2. సిపార్క్స్ (Ceparcs)
సిపార్క్స్ ఒక ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం. ఇది ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ పోర్ట్‌ఫోలియోలను డిజైన్ చేస్తుంది. అమెరికా, భారతీయ స్టాక్ మార్కెట్లలోని 12,000 కంపెనీల డేటాను విశ్లేషించి, దీని అల్గోరిథమ్స్ అత్యుత్తమ షేర్లను గుర్తిస్తాయి. దీని సహాయంతో పెట్టుబడిదారులు తమ ఆర్థిక లాభాలను సులభంగా పెంచుకోవచ్చు.

3. టాప్‌మీడియై (TopMediAI)
టాప్‌మీడియై కంటెంట్ క్రియేషన్‌ను మారుస్తున్న ప్లాట్‌ఫాం. ఇది ఇమేజ్, ఆడియో, వీడియో ఎడిటింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. వాయిస్ క్లోనింగ్, యునిక్ వీడియో ఎడిటింగ్ టూల్స్‌తో సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌ను కొత్త దిశగా తీసుకెళ్తుంది.

4. మోడిఫేస్ (ModiFace)
మోడిఫేస్ అందాలను మెరుగుపరుస్తున్న విప్లవాత్మక టూల్. ఇది వర్చువల్ ట్రీ-ఆన్ టెక్నాలజీ ద్వారా మేకప్, స్కిన్ కేర్, హేర్ స్టైల్ వంటి అనేక బ్యూటీ ఎలిమెంట్స్‌ను ప్రదర్శిస్తుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్రాండ్లచే నమ్మదగిన ఈ టూల్ బ్యూటీ ఇండస్ట్రీలో పెద్ద మార్పుకు దోహదపడుతుంది.

 

Also Read : Gandhi Bhavan fight: గాంధీభవన్ ముందు కాంగ్రెస్ యువ కార్యకర్తల స్ట్రీట్ ఫైటింగ్ - పదవుల కోసం పోరాటం ఇలాగే ! వీడియో

5. ఎంబిబ్ (Embibe)
ఎంబిబ్ విద్యావ్యవస్థను విప్లవాత్మకంగా మార్చుతోంది. ఇది వ్యక్తిగత లెర్నింగ్ పథాలను అందిస్తుంది. విద్యార్థులకు కస్టమైజ్ చేసిన మాక్ టెస్ట్‌లు, పెర్ఫార్మెన్స్ రిపోర్ట్‌లు అందించడం ద్వారా ఈ టూల్ విద్యార్ధులను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది.

2025లో AI టెక్నాలజీ సృష్టిస్తున్న మార్పు
వీటితో పాటు మరిన్ని టూల్స్ కూడా రాబోయే రోజుల్లో మన పనుల సులభతరంగా చేయడానికి ఉపయోగపడతాయి. వ్యాపారాలు, వ్యక్తులు ఈ AI టెక్నాలజీతో అభివృద్ధి చెందటానికి అనుకూల మార్గాలను కనుగొనడం చాలా ముఖ్యమని 2025లో స్పష్టమవుతోంది.

Continues below advertisement