Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !

rajinikanth Praveen: బీహార్‌లో ఓ ఆఫీసర్‌ ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. ఇంటి నిండా గోతాలు ఉన్నాయి. ఆ గోదాల్లో కుక్కిన డబ్బుల కట్టలు బయటపడ్డాయి.

Continues below advertisement

bihar vigilance raid bettiah deo rajinikanth Praveen house counting note with machine : బీహార్‌లోని బెట్టియ అనే జిల్లాకు చెందిన విద్యాశాఖా అధికారిపై అవినీతి ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లారు. ఆయన అద్దె ఇంట్లో ఇంటారు. అద్దె ఇంట్లో ఉండే వ్యక్తి ఏం సంపాదించి ఉంటారని అనుకున్నారు. అలా వెళ్లారు. సోదాలు చేశారు .. ఏమీ దొరకలేదు కానీ.. ఓ మూల నిండుగా ఉన్న గోతాలు కనిపించాయి. రైస్ బ్యాగులు, ఇతర గోదాల్లో ఏదో నింపి పెట్టారు. అవి ఇసుక, కంకర రాళ్లు అనుకుని మొదట సోదాలు చేయలేదు. వెళ్లేటప్పుడు ఆ గోదాల్లో ఏముందో అని తొంగి చూసిన విజిలెన్స్ అధికారులుక షాక్ కొట్టింది. ఎందుకంటే ఆ గోదాల్లో ఉంది డబ్బు కట్టలు. 

Continues below advertisement

బీహార్‌లోని బెట్టియలో జిల్లా విద్యాశాఖాధికారి  నివాసంపై విజిలెన్స్ సోదాలు సంచలనంగా మారాయి. పాట్నా నుంచి వచ్చిన అధికారులు రజనీకాంత్ ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఆయన అద్దె ఇంట్లో ఉంటారు.గోదాల నిండుగా డబ్బు కట్టలు బయటపడటంతో మనుషులు లెక్కపెట్టలేరని సమీపంలోని బ్యాంకుకు వెళ్లి డబ్బులు లెక్క పెట్టే యంత్రం తీసుకు వచ్చారు. మొత్తంగా ఎంత నగదు అంటుందన్నదానిపై లెక్కలు వేస్తున్నారు. డీఈవోగా రజనీకాంత్ ప్రవీణ్ మూడేళ్లుగా బెట్టియలో పని చేస్తున్నారు. 

బీహార్ విద్యావ్యవస్థలో అవినీతి చాలా ఎక్కువ. పరీక్షా పేపర్లను కూడా విపరీతంగా అమ్ముకుంటారు. ఈ క్రమంలో జిల్లాల విద్యాశాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవస్థను సంస్కరించాలన్న లక్ష్యంతో విజిలెన్స్ అధికారులను డీఈవోలపై నిఘా పెట్టి రెయిడ్స్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బీహార్‌లోని అన్ని జిల్లాల డీఈవోలపై దాడులు నిర్వహిస్తున్నారు. బెట్టియా డీఈవో ఇంట్లో కోట్లలో నగదు దొరకడంతో పోలీసులు కూడా వచ్చారు.  సంఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను కూడా మోహరించారు.  

 

బెట్టియా డీఈవో ఇంట్ోల ఇలా దొరకడంతో ఇతర డీఈవోల ఇళ్లల్లో జరిగే సోదాల్లో ఏం దొరుకుతుందన్నదానిపై బీహార్ లో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రతి బీహార్ విద్యాశాఖ అధికారి క్వశ్చన్ పేపర్లు అమ్ముకుని గుట్టల కొద్దీ డబ్బులు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్నీ బయటపడే అవకాశం ఉంది. 

Also Read: Hanumakonda Murder Case: హనుమకొండలో పట్టపగలే దారుణం, నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణహత్య

Continues below advertisement