Rashmika Mandanna : ఇంతకన్నా ఏం కావాలి? సంతోషంగా రిటైర్ అవుతా... 'ఛావా' ఈవెంట్​లో రష్మిక షాకింగ్ కామెంట్స్

Rashmika Mandanna : 'ఛావా' చిత్రంలో మరాఠా రాణి ఏసుబాయి భోంసాలే పాత్రను పోషించిన రష్మిక మందన్న ట్రైలర్ లాంచ్‌లో ఈ పాత్ర తర్వాత రిటైర్ అయ్యేంత సంతృప్తి ఉందని పేర్కొంది.

Continues below advertisement

Rashmika Mandanna About Retirement : నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరియర్ ప్రస్తుతం పీక్స్ లో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో, పలు పాన్ ఇండియా అవకాశాలు రష్మిక మందన్నను వెతుక్కుంటూ వస్తున్నాయి. 'పుష్ప 2' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ నటించిన పీరియాడికల్ డ్రామా 'ఛావా' అనే హిందీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మందన్న రిటైర్మెంట్ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.

Continues below advertisement

సంతోషంగా రిటైర్ అవుతా....
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన ప్రీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఛావా'. ఫిబ్రవరి 24 ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'చావా' మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే కాలికి ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఈవెంట్ కు హాజరై, సినిమా పట్ల తనకున్న అంకితభావం ఏంటో నిరూపించింది. అయితే ఈవెంట్లో రష్మిక మందన్న రిటర్మెంట్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

రష్మిక మాట్లాడుతూ "ఛావా సినిమాలో శంబాజీ భార్య, మరాఠా రాణి యేసుబాయి భోంసాలేగా నటించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత సంతోషంగా రిటైర్ అవుతాను అని డైరెక్టర్ తో ఒకానొక సందర్భంలో చెప్పేశాను. అంటే ఇది అంత గొప్ప పాత్ర, ఆ పాత్రను పోషించిన తరువాత సంతృప్తిగా అన్పించింది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నోసార్లు షూటింగ్ జరుగుతున్న టైంలో, ట్రైలర్ చూశాక కూడా ఎమోషనల్ అయ్యాను. డైరెక్టర్ లక్ష్మణ్ ఏసుబాయి పాత్ర కోసం నన్ను అడిగినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను. అంతేకాదు ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాను. ఈ సినిమాలోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి. అలాగే టీమ్ మొత్తం చక్కగా సహకరించింది" అంటూ రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. అయితే ఆమె సరదాగానే అన్నప్పటికీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో రష్మిక మందన్న 'సంతోషంగా రిటైర్ అవ్వగలను' అంటూ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. 

గాయంతోనే ఈవెంట్ కి... 
రష్మిక మందన్న రీసెంట్ గా జిమ్ లో గాయానికి గురైన సంగతి తెలిసిందే. వర్కౌట్స్ చేస్తున్న టైంలో కాలికి గాయమైనట్టు ఆమె ఫోటోల ద్వారా వెల్లడించింది. అయితే ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ రష్మిక మందన్న అదే గాయంతో ముంబైలో జరిగిన 'ఛావా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హైదరాబాద్ నుంచి వెళ్లడం విశేషం. స్టేజ్ పై రష్మిక మందన్న నడవడానికి విక్కీ సాయం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ శివరాజ్ జీవితం ఆధారంగా రూపొందుతోంది 'ఛావా' మూవీ. ఈ సినిమాలో రష్మిక శంబాజీ భార్య, మరాఠా రాణి యేసుబాయి భోంసాలేగా నటిస్తోంది. ఇక ఈ సినిమా గతేడాదే రిలీజ్ కావలసి ఉంది. కానీ 'పుష్ప 2' మూవీ రిలీజ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Readపాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి

 

Continues below advertisement