BSNL Data Plan: వర్క్ ఫ్రమ్ హోం చేయడానికి, ఓటీటీలో హై క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం మొదలైన వాటికి ఎక్కువ ఇంటర్నెట్ అవసరం. అలాంటి పనులు ప్రతిరోజూ అందుబాటులో ఉన్న 2-3 జీబీ డేటాతో చేయలేము. అందువల్ల మీరు డేటా గురించి చింతించాల్సిన అవసరం లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ టెలికాం సంస్థ తక్కువ ధరలలో ప్రతిరోజూ 30 జీబీ కంటే ఎక్కువ డేటాను అందిస్తోంది.


బీఎస్ఎన్ఎల్ ఫైబర్ రూరల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 1 టీబీ డేటా అందిస్తుంది. అంటే 1,024 జీబీ అన్నమాట. కస్టమర్లకు ప్రతిరోజూ 30 జీబీ కంటే ఎక్కువ డేటా లభిస్తుంది. ఈ డేటా వేగం 30 ఎంబీపీఎస్ వరకు ఉండనుంది. ఒక కస్టమర్ ఒక నెలలో 1 టీబీ డేటాను ఉపయోగించినప్పటికీ, అతను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని తర్వాత అతను 4 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ కోసం వినియోగదారులు ప్రతి నెలా రూ.399 చెల్లించాలి. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


ఇతర ప్రయోజనాలు కూడా...
డేటాతో పాటు ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. కస్టమర్లు లోకల్, ఎస్టీడీ నంబర్‌లతో సహా ఏ నంబర్‌కైనా ఒక నెల పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు. అంటే మీరు స్వేచ్ఛగా మాట్లాడాలనుకున్నా లేదా ఎక్కువ వినోదాన్ని ఆస్వాదించాలనుకున్నా, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ మీ అన్ని అవసరాలను తీరుస్తుంది.


తక్కువ ధరకు అందుబాటులో...
మీరు కొంచెం తక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఎంట్రీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మంచి ఆప్షన్. రూ.399 ప్లాన్ అన్ని ప్రయోజనాలు ఇందులోనే ఉంటాయి. అయితే ఇంటర్నెట్ వేగం 20 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇది కాకుండా పైన పేర్కొన్న ప్లాన్ ప్రకారం అన్‌లిమిటెడ్ డేటా డౌన్‌లోడ్, ఉచిత కాలింగ్ సౌకర్యం కొనసాగుతుంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ. 329గా ఉంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?