BSNL Rs 599 Plan: బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో తన వినియోగదారుల కోసం అనేక చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ టెలికాం సంస్థ ఈ రోజుల్లో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ట్రాయ్ తాజా నివేదిక ప్రకారం బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో 3.5 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం 84 రోజుల చవకైన రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌కు వినియోగదారులకు రోజుకు సగటున రూ.7 మాత్రమే ఖర్చు అవుతుంది.
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ రూ. 599కి వస్తుంది. ఇందులో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత డేటా, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు ప్రతిరోజూ 3 జీబీ డేటాను పొందుతారు. అంటే మొత్తంగా 252 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుందన్న మాట. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. స్పీడ్ తగ్గుతుంది కానీ నెట్ మాత్రం ఆగదన్న మాట.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్
బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లతో కూడా వస్తుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఒక బండిల్ ప్లాన్. ఇది కాలింగ్, డేటా, మెసేజ్‌లతో పాటు కొన్ని వాల్యూ యాడెడ్ సర్వీసులను కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా వినియోగదారులు ఈ ప్లాన్‌తో తమ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ప్లాన్‌తో మీ నంబర్‌ను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ.345 ప్లాన్ కూడా లాంచ్...
రీసెంట్ గా కంపెనీ రూ.345 ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. దీని కింద యూజర్లకు 60 రోజుల వాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్ రోజువారీ తక్కువ డేటాను వాడుతూ కాలింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వినియోగదారుల కోసం. రూ.345 ప్లాన్ ద్వారా కంపెనీ ప్రతిరోజూ 1 జీబీ డేటాను అందిస్తోంది. వినియోగదారులు మొత్తంగా 60 జీబీ డేటా లాభాలను పొందుతారు. దీంతో పాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే