BSNL Data Plan: ఒక కంపెనీ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా రోజుకు 200 జీబీ కంటే ఎక్కువ డేటాను మీకు ఇస్తుంటే మీరు దాన్ని కచ్చితంగా తిరస్కరించలేరు. ఇంత ఎక్కువ డేటాతో మీరు మీ ఇంటితో పాటు ఆఫీసు పనిని కూడా పూర్తి చేయవచ్చు. మీరు ప్రతిరోజూ గంటల తరబడి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లో సినిమాలు, టీవీ షోలు చూసినప్పటికీ ఈ డేటా అనేది అయిపోదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్‌లలో ఒకదాని ద్వారా ఇంత డేటాను అందిస్తోంది. దీంతో పాటు పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


బీఎస్ఎన్ఎల్ ఫైబర్ రూబీ ఓటీటీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కంపెనీ ప్రతి నెల 6500 జీబీ డేటాను అందిస్తోంది. అంటే రోజుకు 200 జీబీ కంటే ఎక్కువ డేటా అన్న మాట. ఈ డేటాను యాక్సెస్ చేయడానికి మీరు 300 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందుతారు. అంటే మీరు డేటా బ్యాలెన్స్, స్పీడ్ రెండింటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట. మీరు ఈ డేటా మొత్తాన్ని ఉపయోగించుకున్నా మీ ఇంటర్నెట్ ఆగిపోదు. ఎందుకంటే ఇప్పుడు అందిస్తున్న 6500 జీబీ డేటా అయిపోతే మీరు 40 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయగలరు. ఇది కాకుండా మీరు అన్‌లిమిటెడ్ ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


అనేక ఓటీటీ యాప్‌లకు ఫ్రీ మెంబర్‌షిప్
ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా, కాలింగ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు బీఎస్ఎన్ఎల్ అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో డిస్నీప్లస్ హాట్‌స్టార్, హంగామా, లయన్స్‌గేట్, షెమారూ, సోనీ లివ్, జీ5 ప్రీమియం, యప్‌టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. చాలా ఆఫర్‌లను పొందాలంటే, మీరు ప్రతి నెలా రూ.4,799 చెల్లించాలి.


అనేక ఇతర చవకైన ప్లాన్లు కూడా...
మీరు అలాంటి ఖరీదైన ప్లాన్‌కు బదులుగా తక్కువ ధర ప్లాన్‌ను తీసుకోవాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఎంట్రీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మంచి ఆప్షన్. ఇది 20 ఎంబీపీఎస్ వేగంతో ప్రతి నెలా 1000 జీబీ డేటాను అందిస్తుంది. ఇందులో మీరు అన్‌లిమిటెడ్ డేటా డౌన్‌లోడ్, ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర నెలకు రూ. 329గా ఉంది. 



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?