Bharat Fiber: మీరు జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ గురించి వినే ఉంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవ గురించి మీకు తెలుసా? ఎయిర్‌టెల్, జియో లాగానే బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. ఈ సర్వీసు పేరు భారత్ ఫైబర్. బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ద్వారా వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడమే కాకుండా అనేక చవకైన, గొప్ప ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఐపీఎల్ సమయంలో మ్యాచ్‌లు చూడటానికి అలాంటి ప్లాన్లు చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
రూ.599 నుంచి ప్రారంభం
ఈ జాబితాలో మొదటి ప్లాన్ రూ. 599. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెల వ్యాలిడిటీని పొందుతారు. 60 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది పూర్తిగా అన్‌లిమిటెడ్ కాదు. కంపెనీ ఈ ప్లాన్‌లో తన వినియోగదారుల కోసం ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) పరిమితిని 3300 జీబీకి సెట్ చేసింది. అంటే నెల మొత్తం మీద 3300 జీబీ ఇంటర్నెట్ డేటాను 60 ఎంబీపీఎస్ వేగంతో పొందుతారు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 60 ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రెండో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 699. ఈ ప్లాన్‌లో కూడా వినియోగదారులు ఒక నెల చెల్లుబాటుతో 60 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవను పొందుతారు. ఈ ప్లాన్‌లో కూడా కంపెనీ తన వినియోగదారుల కోసం 3300 జీబీ ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) లిమిట్‌ను సెట్ చేసింది. మీరు ఒక నెలలో అంత కంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ వేగం 60 ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్‌కి తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా బీఎస్ఎన్ఎల్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీ సర్కిల్‌లోని బీఎస్ఎన్ఎల్ లిస్టింగ్‌ను చెక్ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?
జియో ఫైబర్ చవకైన ప్లాన్
జియో ఫైబర్ అందిస్తున్న చవకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 399తో వస్తుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెల పాటు 30 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌తో ఏ ఓటీటీ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ లభించబోదు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ చవకైన ప్లాన్
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న చవకైన ప్లాన్ రూ. 499. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఒక నెల పాటు 40 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌తో కూడా ఏ ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్ అందించలేదు.