'Happy Easter' Wishes for Family, Friends, and Colleagues: మానవాళికి పాప విముక్తిని కల్పిస్తూ ఏసు క్రీస్తు తనని తాను త్యాగం చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడ్ అయితే..తిరిగి వచ్చిన రోజు ఈస్టర్. అందుకే గుడ్ ఫ్రైడే రోజు శుభాకాంక్షలు తెలియజేయరు కానీ దేవుడు తిరిగొచ్చినందుకు ఈస్టర్ ని సందడిగా జరుపుకుంటారు. ఏసుని నిజమైన దేవుడిగా గుర్తించిన రోజే ఈస్టర్. చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని చెప్పడమే ఈస్టర్ ఆంతర్యం. ఈ రోజున ప్రార్థనలు చేస్తారు,  విందులో పాల్గొంటారు.  ఎగ్ రోలింగ్, ఎగ్ ట్యాపింగ్, ఎగ్ డెకొరేషన్ వంటి సాంప్రదాయ ఈస్టర్ గేమ్‌లు ఆడతారు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్. ఈ ఏడాది గుడ్ ఫ్రైడ్ మార్చి 29 శుక్రవారం వచ్చింది...ఆ తర్వాత వచ్చే ఆదివారం అంటే... మార్చి 31న ఈస్టర్. ఈ సందర్భంగా మీ సన్నిహితులకు, స్నేహితులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయండి...


Also Read: Good Friday 2024 Date: గుడ్ ఫ్రైడే ఎప్పుడు , ఆంతర్యం ఏంటి - ఈ రోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పరు!


ఏసు క్రీస్తు పునరుత్థాన పవిత్ర దినం ఈస్టర్ సందర్భంగా 
మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు


ప్రేమ, శాంతి, అహింసా మార్గంలో మానవాళి యావత్తూ నడుచుకోవాలి
క్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలి
మీ అందరకీ ఈస్టర్ శుభాకాంక్షలు


ప్రాణత్యాగం చేసిన క్రీస్తు మూడో రోజే సజీవుడై తిరిగొచ్చిన పవిత్ర దినం ఈస్టర్
మీ జీవితంలో ఆనందంవెల్లివిరియాలని  ప్రార్థిస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు 


సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్
మీకు, మీకుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు


దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ
హ్యాపీ ఈస్టర్ #HappyEaster


Also Read: ఈస్టర్ ప్రాముఖ్యత ఏంటి - ఎందుకు జరుపుకుంటారు - ఇది కేవలం క్రైస్తవుల పండుగే అనుకుంటున్నారా!
 
సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజున
 అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలి
హ్యాపీ ఈస్టర్
 
ప్రేమ, శాంతి, అహింసా మార్గంలో మానవాళి యావత్తూ నడుచుకోవాలన్న
క్రీస్తు  బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలి
ఈస్టర్ శుభాకాంక్షలు


ఈ ఈస్టర్ మీకు సంతోషాన్ని, ప్రేమను మరియు శాంతిని అందివ్వాలి
 హ్యాపీ ఈస్టర్ 2024


దేవుని ఆశీర్వాదాలు , ఆనందంతో నిండిన సంతోషకరమైన రోజుది
అందరకీ ఈస్టర్ శుభాకాంక్షలు


ఈస్టర్ సీజన్లో యేసు పునరుత్థానం మీ హృదయంలో విశ్వాసాన్ని నింపాలి
 హ్యాపీ ఈస్టర్ 2024 


మీ ఈస్టర్ వేడుక ప్రేమ , నవ్వుతో నిండి ఉండనివ్వండి!
ఈస్టర్ శుభాకాంక్షలు


 ఈ ఈస్టర్ మీకు నూతన విశ్వాసం, ఆశ , ప్రేమను తీసుకురావాలి
ఈస్టర్ శుభాకాంక్షలు


 మీకు ఆనందం , ఆరోగ్యంతో కూడిన ఆశీర్వాదం ఆ దేవుడు అందించాలి
 ఈస్టర్ శుభాకాంక్షలు! హ్యాపీ ఈస్టర్!


ఈస్టర్ ఆనందం మీ హృదయంలో , మీ ఇంట్లో నిండిపోవాలి
ఈస్టర్ శుభాకాంక్షలు


 ప్రేమ , నవ్వులతో నిండిన సంతోషకరమైన రోజు 
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు
 
ఈస్టర్ ఆనందం ఏడాది పొడవునా మీతో ఉండనివ్వండి
 హ్యాపీ ఈస్టర్ 2024


వసంతకాలం అందం ఈస్టర్ సందేశం 
మీ హృదయంలో నిండాలి ఆనందం
 ఈస్టర్ శుభాకాంక్షలు


ఏసు ప్రేమ , త్యాగం గురించి ప్రతిబింబించే సమయం
ఇతరులకు సేవ చేయడానికి  మీకు స్ఫూర్తినివ్వాలి
హ్యాపీ ఈస్టర్


Also Read: Ugadi Rasi Phalalu Sri Krodhi Nama Samvatsara 2024 -2025: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!