Lenovo Tab M11 Launched: లెనోవో ట్యాబ్ ఎం11 మనదేశంలో లాంచ్ అయింది. 2024 జనవరిలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్) 2024లో దీన్ని మొదట పరిచయం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లెనోవో ట్యాబ్ ఎం11 అమెరికాలో అందుబాటులోకి వస్తుందని అప్పుడే ప్రకటించారు. కానీ అంతకంటే ముందే మనదేశంలో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ద్వారా ఈ ట్యాబ్లెట్ రన్ అవుతుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. ఏకంగా 7040 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ట్యాబ్‌లో అందించారు. ఇది 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


లెనోవో ట్యాబ్ ఎం11 ధర
ఈ ట్యాబ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వైఫై ఓన్లీ ఆప్షన్ ధర రూ.18,000గా నిర్ణయించారు. సిమ్‌ కార్డుతో కూడా ఉపయోగించే ఆప్షన్ ఉన్న ఎల్టీఈ వేరియంట్ ధర రూ.22,000గా ఉంది. లెనోవో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ట్యాబ్ లిస్ట్ అయింది. దీనికి సంబంధించిన సేల్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.


లెనోవో ట్యాబ్ ఎం11 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
లెనోవో ట్యాబ్ ఎం11లో 11 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ట్యాబ్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను పొందింది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను హెచ్‌డీ క్వాలిటీలో స్ట్రీమ్ చేయవచ్చు. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై లెనోవో ట్యాబ్ ఎం11 రన్ కానుంది.


8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్‌పై లెనోవో ట్యాబ్ ఎం11 పని చేయనుంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్లు దీనికి అందించనున్నారు. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే క్వాడ్ స్పీకర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ట్యాబ్‌తో పాటు లెనోవో ట్యాబ్ పెన్‌ కూడా రానుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 7040 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. ఐపీ52 డస్ట్, స్ప్లాష్ రెస్టిస్టెన్స్ రేటింగ్ ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని కూడా అందించారు. దీని మందం 0.71 సెంటీమీటర్లు కాగా, దీని బరువు 465  గ్రాములుగా ఉంది.


లెనోవో ఇటీవలే ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే, కీబోర్డ్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను డిస్‌ప్లే చేసింది. లెనోవో తీసుకువచ్చిన ఈ ప్రత్యేకమైన ల్యాప్‌టాప్ పేరు లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే. ఇందులో 17.3 అంగుళాల బెజెల్ లెస్ స్క్రీన్‌ను అందించారు. 720పీ రిజల్యూషన్‌తో మైక్రో ఎల్ఈడీ స్క్రీన్‌ను ఈ ల్యాప్‌టాప్‌లో చూడవచ్చు. ఫ్లోటింగ్ ఫుట్‌ప్యాడ్ డిజైన్‌ను కలిగి ఉన్న ట్రాన్స్‌పరెంట్ కీబోర్డ్‌ను కూడా ఇందులో అందించారు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?