AI-ఆధారిత బాట్‌ల (Bots) వినియోగం ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన నేపథ్యంలో  మున్ముందు ముప్పుతప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆటోమేటేడ్ బాట్‌లు గత సంవత్సరం ఇంటర్నెట్‌లోని మొత్తం ట్రాఫిక్‌లో దాదాపు సగం స్థానాన్ని ఆక్రమించాయి. వాటిలో చాలా మంది స్పామ్, స్కామ్‌లు, వైరస్‌లను వ్యాప్తి చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆన్‌లైన్ కార్యకలాపాలలో దాదాపు సగం వరకు మనుషుల కంటే ఆటోమేటెడ్ బాట్‌లే నిర్వహిస్తున్నట్లు తాజాగా అధ్యయనం వెల్లడించింది. 


ఇంటర్నెట్ ను స్వాధీనం చేసుకోనున్న AI-బాట్ లు!


స్పామ్, సైబర్ క్రైమ్‌లతో AI-శక్తితో పనిచేసే బాట్‌లు వేగంగా  ఇంటర్నెట్‌ను స్వాధీనం చేసుకోవడంలో గణనీయంగా పురోగతి సాధించినట్లు తేలింది. 2022లో ఆన్‌లైన్‌లో ఈ రకమైన యాక్టివిటీలో భారీ పెరుగుదల కనిపించిందని, మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 47.4% మనుషుల నుంచి కాకుండా బాట్‌ల నుండి వస్తున్నాయని Impervaలోని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. 'బ్యాడ్ బాట్స్' లేదంటే జంక్ ఇమెయిల్స్ ను పంపేవి, వ్యక్తుల డేటాను దొంగిలించేవి ఈ ట్రాఫిక్‌లో 66.6%ని కలిగి ఉన్నాయని హెచ్చరించారు. 


ఆన్ లైన్ సేవలకు తీవ్ర ముప్పు తప్పదా?


అంటే, ChatGPT, GPT-4 లాంటి సాధనాలు చెడు బాట్‌లకు 'సూపర్ పవర్స్'గా పని చేయడం విశేషం. వీటిని సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించడంతో పాటు ఆన్‌లైన్‌లో అల్లకల్లోలం కలిగించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు.  ఇంపెర్వా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్ల్ ట్రైబ్స్ AI-ఆధారిత బాట్‌ల గురించి కీలక విషయాలు వెల్లడించారు. "2013 నుంచి బాట్‌లు వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే, ఇప్పుడు AI బాట్‌లు రావడంతో, రాబోయే 10 సంవత్సరాలలో సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది” అన్నారు. అంతేకాదు,  "సైబర్ నేరగాళ్లు అధునాతన ఆటోమేషన్‌తో API ఎండింగ్ పాయింట్స్, అప్లికేషన్ బిజినెస్ లాజిక్‌లపై ఎక్కువగా దాడులు చేస్తారు.  ఫలితంగా, బ్యాడ్ బాట్‌లతో సంబంధం ఉన్న వ్యాపార అంతరాయం, ఆర్థిక ప్రభావం రాబోయే సంవత్సరాల్లో మరింత తీవ్రం అవుతుంది” అని తెలిపారు. 


ఉక్రేనియన్ వెబ్ సేవలపై 145% పెరిగిన సైబర్ దాడులు  


సైబర్ వార్‌ ఫేర్‌లో ఈ బాట్‌లు ఎలా ఉపయోగించబడుతున్నాయో తాజాగా నివేదిక  హైలైట్ చేసింది.2022 ప్రారంభంలో ఉక్రేనియన్ వెబ్ సేవలపై దాడులు 145% వరకు పెరిగాయని తెలిపింది. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బాట్‌ల వినియోగం గురించి ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసే సమయంలో జరిగిన చర్చల వేళ ప్రధాని పాత్ర పోషించాయి.  ట్విట్టర్ తన ప్లాట్‌ ఫారమ్‌లోని బాట్‌ల సంఖ్యపై పూర్తి గణాంకాలను అందించకపోతే ఒప్పందం నుండి వైదొలుగుతానని మస్క్ బెదిరించారు. కంపెనీ చివరకు ఆయన అడిగిన వివరాలను అందివ్వక తప్పలేదు. చివరికి ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను $44 బిలియన్లకు మస్క్ కొనుగోలు చేశారు.


అయితే, AI-ఆధారిత బాట్‌లతో తీవ్ర ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. మున్ముందు ఇవి ఇంటర్నెట్ మొత్తాన్ని స్వాధీనం చేసుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా పలు సమస్యలకు కారణం కారణం కాబోతున్నాయంటున్నారు. 


Read Also:  మీ ఫోన్ పోయిందా? కంగారు పడాల్సిన అవసరం లేదు, అదెక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు!