బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా డెవలపర్ క్రాఫ్టన్ ఈ గేమ్‌కు కొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన అప్‌డేట్ వెర్షన్ 1.7లో లీగ్ ఆఫ్ లెజెండ్స్ తరహా డిజైన్‌ను అందించారు. ఇందులో ప్రత్యేక ఫీచర్లు, కొత్త గేమ్ ప్లే మెకానిక్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు లివర్‌పూల్ ఎఫ్‌సీ(ఫుట్‌బాల్ క్లబ్)తో కూడా క్రాఫ్టన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్లేయర్లకు ప్రత్యేక రివార్డులు దక్కనున్నాయి.


ద రీకాల్ అనే ప్రత్యేక ఈవెంట్‌ను కూడా బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాలో అందించనున్నారు. ఇది కేవలం మనదేశంలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. రాయల్‌పాస్ మంత్ 5 అప్‌డేట్ కూడా వస్తుంది. బగ్ ఫిక్సెస్, ఇంప్రూవ్‌మెంట్స్ కూడా ఈ అప్‌డేట్‌లో రానున్నాయి.


దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్‌ను క్రాఫ్టన్ విడుదల చేసింది. ఎరాంగిల్, లివిక్, సాన్‌హోక్ మ్యాప్‌లకు కొత్త మిర్రర్ వరల్డ్ మోడ్‌ను కూడా ఇందులో అందించనున్నారు. ఒక్కసారి దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు ఎంచుకున్న మ్యాప్‌లో మిర్రర్ ఐలాండ్ కనిపిస్తుంది.


అందులోకి విండ్ వాల్ పోర్టల్ నుంచి ఎంటర్ కావచ్చు. ఒక్కసారి ఎంటర్ అయ్యాక కెయిట్‌లీన్, జేస్, జింక్స్, వీ క్యారెక్టర్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని లీగ్ ఆఫ్ లెజెండ్స్, ఆర్కేన్ ఆడవచ్చు. ఆటగాళ్లకు హెక్స్‌టెక్ క్రిస్టల్స్‌ను రివార్డులుగా అందిస్తారు. మిర్రర్ ఐల్యాండ్‌లో ప్లేయర్ మరణించినా లేదా మిర్రర్ ఐల్యాండ్ ప్లేటైం అయిపోయినా.. ఆటగాళ్లు రెగ్యులర్ బ్యాటిల్ గ్రౌండ్లకు వచ్చేస్తారు.






దీంతోపాటు బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా క్లాసిక్ మోడ్‌లో పిగ్గీబ్యాంక్ ఫీచర్లు కూడా లభించనున్నాయి. ఈ పిగ్గీబ్యాంక్ ఫీచర్ ద్వారా ఇందులో ఆటగాళ్లు తమ టీమ్‌మేట్స్ గేమ్‌లో మరణిస్తే.. వారిని తిరిగి గేమ్‌లోకి తీసుకురావచ్చు. ఎస్ఎల్ఆర్, ఎస్‌కేఎస్, మినీ14, వీఎస్ఎస్, డీపీ28 వెపన్లను కూడా ఎన్‌హేన్స్ చేయనున్నారు.


ఈ అప్‌డేట్లతో పాటు గ్రెనేడ్ అప్డేట్ కూడా అందించనున్నారు. వేసిన గ్రెనేడ్ కచ్చితంగా ఎక్కడ పడనుందో దీని ద్వారా ప్లేయర్లు జడ్జ్ చేయవచ్చు. దీంతోపాటు లివర్‌పూల్ ఎఫ్‌సీతో కూడా బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భాగస్వామ్యం ఏర్పరచుకోనుంది. ఈ అప్‌డేట్ ద్వారా లివర్‌పూల్ బ్రాండెడ్ పారాచూట్, బ్యాక్‌ప్యాక్, జెర్సీ లభించనున్నాయి.


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి