Just In





Best Brad Band Connetion: రూ.500 కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లివే!
Best Broadband Connection For Home :తక్కువ ఖర్చుతో బ్రాండ్ చూస్తున్న వారికి ఉత్తమ ప్లాన్‌లు ఇవి. ఈ లిమిట్‌లో జియో, ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ప్లాన్‌లు అందిస్తున్నాయి.

Best Broadband Connection For Home :పట్టణం నుంచి పల్లె వరకు అన్ని ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ విస్తరిస్తోంది. లోకల్ కంపెనీల నుంచి పెద్ద పెద్ద టెలికాం సంస్థలు ఈ కనెక్షన్లు అందిస్తున్నాయి. మొన్నటి వరకు ఈ బ్రాడ్ బ్యాండ్‌ల కోసం భారీగా చెల్లించాల్సి వచ్చేది. పోటీ పెరగడంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్లాన్‌లు తీసుకొస్తున్నాయి.
కొత్త కంపెనీల రాకతో బ్రాడ్ బ్యాండ్ రంగంలో విపరీతమైన పోటీ పెరిగింది. కనెక్షన్లు పెంచుకోవడానికి సంస్థలు పోటీ పడుతున్నాయి. అందుకే ప్రజలకు అవసరమైన చెల్లించే సౌలభ్యం ఉన్న ప్లాన్‌లు పరిచయం చేస్తున్నారు. అందుకే పెద్ద కంపెనీలు కూడా దిగిరాక తప్పలేతు. జియో, ఎయిర్‌టెల్ ప్రభుత్వ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు రూ. 500 కంటే తక్కువ ధరకే ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత డేటాతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.
జియో రూ.399 ప్లాన్
జియో 399 రూపాయలకు నెలవారీ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో 3,300GB అంటే రోజుకు 100GB కంటే ఎక్కువ డేటా ఇస్తోంది. వర్క్ నుంచి వినోదం వరకు మీరు ఎక్కడా డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఉంటుందీ ప్లాన్. వినియోగదారులు ఈ డేటాను 30Mbps వేగంతో యాక్సెస్ చేయగలరు.
Also Read: సమ్మర్ వచ్చేసింది.. ఏసీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్
ఈ ప్లాన్ జియో కంటే ఖరీదైనది. అదే టైంలో ప్రయోజనాలు కూడా ఎక్కువే. ఈ ప్లాన్‌లో నెల పాటు 40 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తోంది. డేటా అయిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ల్యాండ్ లైన్ నుంచి అపరిమిత వాయిస్ కాలింగ్ , అపోలో 24/7 సభ్యత్వం కూడా ఇస్తోంది.
బిఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్
జియో లేదా ఎయిర్‌టెల్ కనెక్షన్ మీకు అందుబాటులో లేకుంటే మీరు బిఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకోవచ్చు. దేశంలోని ఏకైక ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన ఈ సంస్థ కూడా అందుబాటు ధరలకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది. నెలవారీ ప్లాన్ రూ.399. ఇందులో 30Mbps వేగంతో 1,400 GB డేటా ఇస్తోంది. దీనితోపాటు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత లోకల్, STD కాలింగ్ సౌకర్యం ఇస్తోంది. అంటే ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్న ఐఫోన్ SE4- ధరెంతో తెలుసా? అప్‌గ్రేడ్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న మోడల్