Bank of Baroda Vacancies: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీ కాపిటల్ మార్కెట్ లిమిటెడ్ విభాగంలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ(ఫైనాన్షియల్ సర్వీస్, సేల్స్ ప్రొడక్ట్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా ఫిబ్రవరి 28 వరకు సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
వివరాలు..
* బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 80
రాష్ట్రం | జోన్ | ఖాళీలు |
ఆంధ్రప్రదేశ్ | సౌత్ & వెస్ట్ | 02 |
బీహార్ | సౌత్ & వెస్ట్ | 03 |
చండీగఢ్ | నార్త్ | 02 |
గుజరాత్ | వెస్ట్ జోన్ | 12 |
గురుగ్రామ్ | నార్త్ | 01 |
జైపూర్ | నార్త్ | 09 |
జార్ఖండ్ | సౌత్ & వెస్ట్ | 02 |
కర్ణాటక | సౌత్ & వెస్ట్ | 09 |
లక్నో | నార్త్ | 04 |
లూధియానా | నార్త్ | 02 |
మధ్యప్రదేశ్ | వెస్ట్ జోన్ | 06 |
మహారాష్ట్ర | వెస్ట్ జోన్ | 14 |
నోయిడా | నార్త్ | 02 |
నార్త్ ఢిల్లీ | నార్త్ | 03 |
ఒరిస్సా | సౌత్ & వెస్ట్ | 01 |
తమిళనాడు | సౌత్ & వెస్ట్ | 02 |
తెలంగాణ | సౌత్ & వెస్ట్ | 01 |
ఉత్తర ప్రదేశ్ | నార్త్ | 05 |
అర్హతలు..
➥ ఫైనాన్షియల్ సర్వీసెస్ సేల్స్ ప్రొడక్ట్‌లో గ్రాడ్యుయేషన్‌తో పాటు కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
➥ సేల్స్ & మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి.
➥ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండాలి.
➥ ఎక్స్‌లెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్ ఐడీ: ‘careers@bobcaps.in’.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025.
ALSO READ:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ ఉద్యోగాలు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) రెగ్యులర్ ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రేడ్ & ఫారెక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
పోస్టులు: సీనియర్ మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్ జావా, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్ జావా, ఆఫీసర్-డెవలపర్ ఫుల్ స్టాక్ జావా, సీనియర్ మేనేజర్ డెవలపర్- ఫుల్ స్టాక్, మేనేజర్-డెవలపర్- ఫుల్ స్టాక్, ఆఫీసర్-డెవలపర్- ఫుల్ స్టాక్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, మేనేజర్-క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్- ఏఐ ఇంజినీర్, మేనేజర్- ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్- ఏపీఐ డెవలపర్, మేనేజర్- ఏపీఐ డెవలపర్, సీనియర్ మేనేజర్- ఏపీఐ డెవలపర్, మేనేజర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, మేనేజర్- సర్వర్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీసర్- సర్వర్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, తదితరాలు...
నోటిఫికేషన్, పోస్టులు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..