Ennallo Vechina Hrudayam Serial Today Episode : బాలకి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. ఆశ్రమానికి తీసుకెళ్తారు. వైద్యం మొదలు పెడతామని గురువుగారు చెప్తారు. మరోవైపు ల్యాండ్ రిజిస్ట్రేషన్‌కి ఈరోజే లాస్ట్ డేట్ అని గాయత్రీ ఫోన్ చేయడంతో అనంత్ తండ్రికి విషయం చెప్తాడు. అనంత్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమంటే అనంత్ తాను లక్ష్మణుడు అని అన్నయ్య ఆస్తులకు కాపలా మాత్రమే అంటాడు. దాంతో ఫణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని అనుకుంటారు. ఫణి పైకి మాత్రం తనకు ఆస్తి వద్దని యాక్టింగ్ చేస్తాడు. అందరూ ఒప్పించి ఫణి పేరు మీద రిజిస్ట్రేషన్‌కి ఒప్పిస్తారు.
మరోవైపు గురువుగారు త్రిపురకి కాల్ చేసి ఉత్తేరేణి వేరు తీసుకురమ్మని చెప్తారు. పసుపు దంచే కార్యక్రమం అయింది నేను రాలేను అని త్రిపుర అంటే దానికి గురువుగారు బాల ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని నీ మాటే వింటాడు నువ్వు వస్తే అతన్ని కాపాడగలం అని చెప్తారు. ఆలోచించకుండా త్వరగా రమ్మని గురువుగారు చెప్తారు. త్రిపుర బాల గురించి ఆలోచించి ఉత్తరేణి వేరు పట్టుకొని బయల్దేరుతుంది. ఎవరూ చూడకుండా వెళ్లాలి అనుకుంటే రమాదేవి త్రిపురని ప్రశ్నిస్తుంది. ఎక్కడికో వెళ్తున్నావ్ అంటే లేదు గుమ్మం దగ్గర నిల్చొడానికి వచ్చానని త్రిపుర అంటుంది. అక్కడ కూడా నిల్చొవద్దు దిష్టి తగులుతుందని రమాదేవి చెప్పి ఫోన్ రావడంతో వెళ్లిపోతుంది. ఇంతలో త్రిపుర తాతయ్యకు విషయం చెప్తుంది. పొలిమేర దాటడం లేదు కదా తాతయ్య అని పిన్నిని మ్యానేజ్ చేయి బాల ప్రాణాలు కాపాడటానికి వెళ్లాలి అంటుంది. సరే అని రమాప్రభకి నీర తీసుకురమ్మని చెప్పి త్రిపురని ప్రకృతి వైద్యశాలకు పంపిస్తారు.
త్రిపుర అక్కడికి వెళ్తుంది. గురువుగారిని కలిసి వేరు ఇస్తుంది. బాల అలా చలనం లేకుండా పడి ఉండటంతో త్రిపుర చూసి బాధ పడుతుంది. బాల కోసం కషాయం నీరుతుంది. తర్వాత దాన్ని బాలకి తాగిస్తుంది. కషాయం తాగతానే బాల విరుగుడు మందు కక్కేస్తాడు. దాంతో ఇక ఏ ప్రమాదం లేనట్లే అని గురువు గారు చెప్తారు. త్రిపుర హ్యాపీగా ఫీలవుతుంది. గురువు గారు బామ్మ, యశోదతో ప్రమాదం తప్పిందని ఇక ఏ ప్రాబ్లమ్ లేదని అంటారు. త్రిపుర బాల చేతులు రుద్దుతుంది. రిజిస్ట్రేషన్ జరిగే టైంలో ఇలా జరగాలా అని ఫణి రిజిస్ట్రేషన్‌కి అర్హుడు కాదని బాల కృష్ణ మన ఇంటి వంశోద్దారకుడు అని మంచి వాడని బామ్మ, యశోద బాల మంచితనం గురించి మాట్లాడుకోవడం త్రిపుర వింటుంది. అందరి మంచి కోరుకుంటాడు కాబట్టి ఆస్తులు వాడి పేరున ఉంటే బాగున్న అనుకొని బామ్మ అంటుంది. ఇక ఇద్దరూ బాల కోసం గుడికి వెళ్తారు.
మరోవైపు అనంత్ వాళ్లు రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. గాయత్రీకి ఫణి డిటైల్స్ ఇచ్చి ఫణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమంటారు. త్రిపుర బాల చేతిని రుద్దుతూ ఉండటంతో బాల లేచి కూర్చొంటాడు. సుందరి అని త్రిపురని పలకరిస్తాడు. ఇక త్రిపుర బాలతో మీకు ఇప్పుడు అంతా బాగుంది కాదా పదండి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్దాం అంటుంది. నేను రావాలి అంటే మీరు నా పుట్టిన రోజుకి సాయంత్రం వస్తేనే నేను వస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!