Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున వచ్చిన సంతోషంలో అందరూ కలిసి భోజనం చేసి మాట్లాడుకొని హాల్‌లోనే కూర్చొనే నిద్ర పోతారు. మిధున తల్లి ఒడిలో పడుకొంటుంది. నిద్ర పట్టకపోవడంతో బయటకు వచ్చి కూర్చొని దేవాతో పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు దేవా మిధున వచ్చినట్లు కల కంటాడు. తను ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అనుకున్నా ఇప్పుడేంటి తను గుర్తొస్తుంది. తను ఉన్నట్లు భ్రమ పడుతున్నా అనుకుంటాడు.


మిధున: నా మనసు ఏంటి ఇంత దిగులుగా అనిపిస్తుంది. నా చుట్టూ ఇంత మంది ఉన్నారు అయినా సరే శూన్యంలో ఉన్నట్లు నాకు ఎందుకు అనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఏదో కోల్పోయినట్లు నాకు అనిపించడం ఏంటి.
దేవా: అసలు తను నా ఆలోచనలోనే ఉండకూడదు కదా. మరి తను నా జ్ఞాపకాల్లో ఉండటం ఏంటి. అబ్బా ఎందుకు ఇలా జరుగుతుంది నాకు.
మిధున: దిగులు ఇంత నరకంగా ఉంటుందా.
లలిత: మిధున పడుకోకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా. మిధున నువ్వు రావడంతో అందరికీ ప్రాణాలు తిరిగి వచ్చినట్లు ఉంది. అందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో చూశావు కదా. ఇంట్లో ఈ వెలుగు అందరి సంతోషం మీ నాన్న సంతోషం అన్నీ నీ చేతిలోనే ఉందమ్మా. సరేనా. మరోసారి ఈ ఇంటికి చీకటి చుట్టు ముట్టదని నమ్మకంతో ఉన్నానమ్మా. 


మిధున ఇంటికి వచ్చిందని త్రిపుర తన తమ్ముడు ఆదిత్య వాళ్లకి ఇంటికి రమ్మని చెప్తుంది. ఆదిత్య మిధున తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని ఆదిత్య అనుకుంటాడు. ఆదిత్యతో తన తల్లి రౌడీ వెంట వెళ్లిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మ నీకు ఎంట్రా అని ఈ పెళ్లి వద్దని అంటుంది. నేను ప్రేమించా నా ప్రేమ కోసం రండి అని ఆదిత్య తీసుకెళ్తాడు. ఆదిత్య మిధునని పలకరిస్తాడు. ఆదిత్య తల్లి మిధునకు చిల్లర రౌడీ కోసం వెళ్లిపోయింది తనని చూసి అందరూ నవ్వుతున్నారని అంటుంది. ఆదిత్య తల్లి పద్మని ఏం మాట్లాడొద్దని అంటాడు. ఇక ఆదిత్య తండ్రి హరివర్దన్‌తో మాట్లాడటానికి వెళ్తాడు. త్రిపుర ఆదిత్య, మిధునని మాట్లాడుకోమని చెప్పి అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్తుంది. దేవా పురుషోత్తం దగ్గరకు వెళ్లి తన పీడ పోయిందని తలపోటు పోయిందని గెంతులేస్తాడు. ఇక పురుషోత్తం దేవా ఇంట్లో దాచిన డాక్యుమెంట్లు తీసుకురమ్మని దేవాకి చెప్తాడు.  


ఆదిత్య: సారీ మిధున మా అమ్మ నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. 
మిధున: పర్లేదు ఆదిత్య మీ అమ్మ మాటల వెనక ఉన్న బాధ నాకు అర్థమైంది. ఇలాంటి మాటలు విని విని నాకు అలవాటు అయిపోయింది. లాయర్‌గా నీ లైఫ్ ఎలా ఉంది.
ఆదిత్య: పెళ్లి ఆగిపోయిన తర్వాత నేను కోర్టుకు వెళ్లడం మానేశాను. నేను వాదించిన ఒకే ఒక్క కేసు మొన్న దేవాదే. దాదాపుగా నా ప్రొఫెషన్ వదిలేశా. ఒంటరిగా మిగిలిపోయా.
మిధున: అదేంటి ఆదిత్య నీకు లాయర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం కదా.
ఆదిత్య: నాకు అన్నింటి కన్నా ఇష్టం అయిన నువ్వు వదిలిపోతే ఇంకెలా ఉంటా మిధున.
మిధున: ఆదిత్య ప్లీజ్ నీ కెరీర్ మీద ఫోకస్ చేయ్. మా నాన్నలా నువ్వు పెద్ద జడ్జి అవ్వాలి. 
ఆదిత్య: మనం కలిసిన క్షణాలు మాట్లాడుకున్న క్షణాలు కలిసి ఒకే జీవితంగా బతకాలి అని నిర్ణయించుకున్న క్షణాలు.. లైఫ్ చాలా బాగుండేది. నాకే పవర్స్ వస్తే మన లైఫ్ కొన్ని రోజులు వెనక్కి తీసుకెళ్లాలని ఉంది. మన పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నువ్వు కోనేటిలో దీపాలు వదులు తుంటే నాకు ఎలా కనిపించావో తెలుసు దివి నుంచి భువికి వచ్చిన దేవతలా కనిపించావు. ఇలాంటి దేవత నా జీవితంలోకి వస్తుందా అని ఎంత సంతోషపడ్డానో తెలుసా. తర్వాత గుడిలో నా ప్రేమ నీకు చూపించాలని గుడి ముందు నీ ఫొటో వేయించినప్పుడు అందరూ నన్ను పిచ్చోడిలా అనుకున్నారు కానీ నేను నీ రియాక్షన్ చూడాలి అనుకున్నా. చూశాను. అప్పుడు నీ ముఖంలో చూసిన ఆనందం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పటి వరకు నీకు తెలియని విషయం చెప్పనా. నీకు బజారులో నచ్చిన గాజులు వేరే వారు తీసుకుంటే వాళ్లని బతిమాలాను ఇవ్వను అనేసరికి దొంగతనం చేశా మనకు అవి అలవాటు లేని పనులు కదా అందరూ కలిసి పిచ్చ కొట్టుడు కొట్టారు. మిధున పగలబడి నవ్వుతుంది. ఎన్నిరోజులు అయింది మిధున నిన్ను ఇలా నవ్వుతూ చూసి జరిగింది మర్చిపోదాం కొత్త లైఫ్ మొదలు పెడదాం.


దేవా ఫైల్స్ కోసం ఇంటికి వస్తాడు. పెట్టిన చోట వెతికితే అవి ఉండవు. దేవా టెన్సన్ పడతాడు. ఇక హరివర్దన్‌తో త్రిపుర వాళ్లు ఆదిత్య, మిధునల పెళ్లి గురించి మాట్లాడుతారు. మిధున మళ్లీ మనసు మార్చుకొని వెళ్లిపోయే ప్రమాదం ఉందని త్రిపుర చెప్తుంది. అందరూ కలిసి హరివర్దన్‌ని ఒప్పిస్తారు. రేపు ఉదయం గుడిలో పెళ్లి జరిపించేద్దామని త్రిపుర అంటుంది. మిధున అభిప్రాయం అడగాలి కదా అని బామ్మ అంటే మిధునకు అభిప్రాయం అడిగితే మళ్లీ తాళి పట్టుకొని కూర్చొంటుందని అంటుంది. మిధునతో మాట్లాడుదామని త్రిపుర అంటే హరివర్దన్ సరే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!