Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దాసు దశరథ్‌కి కాల్ చేస్తాడు. అన్నయ్య నీకో నిజం చెప్పాలి అర్జెంటుగా ఇంటికి రా అంటాడు. దశరథ్ దాసుతో నువ్వు చెప్పే నిజం కోసం ఎదురు చూస్తున్నానురా.. నేను ఇప్పుడే వస్తున్నా నువ్వు మాత్రం బయటకు రాకు ఇంట్లోనే ఉండు అంటాడు. తండ్రి మాటలు విన్న జ్యోత్స్న షాక్ అయిపోయి దాసు నిజం చెప్పకుండా ఎలా అయినా ఆపాలని అనుకుంటుంది. ఇక దశరథ్ దాసు ఇంటికి వెళ్తాడు. జ్యోత్స్న కూడా వెనకాలే దాసు ఇంటికి వెళ్తుంది.


దాసు: అన్నయ్య నువ్వు వచ్చావా నీకు నిజం చెప్పకుండా ఎక్కడ చనిపోతానో అనుకున్నా. అన్నయ్య నన్ను జ్యోత్స్న చంపాలి అనుకుంటుంది అన్నయ్య. జ్యోత్స్న నోరెళ్లబెడుతుంది.
దశరథ్: ఎందుకు చంపాలి అనుకుంటుంది.
దాసు: ఇక అన్యాయం జరిగింది అన్నయ్య. నువ్వు క్షమించలేని అన్యాయం జరిగింది అన్నయ్య. నేను చెప్పిన నిజం తర్వాత నువ్వు ఒకరిని బతకనివ్వవు. నువ్వు ఎవరినీ చంపను అని మాట ఇవ్వు.
దశరథ్: నేను ఎందుకు చంపుతానురా నువ్వు నీకు తెలిసిన నిజం చెప్పు.
జ్యోత్స్న: రేయ్ చెప్పొద్దురా. అంటూ పొరపాటున ప్లవర్ వాష్ పడేస్తుంది. దాంతో దశరథ్ కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే జ్యోత్స్న కనపడుతుంది.


దశరథ్ షాక్ అయిపోతాడు. దాసు దగ్గరకు వెళ్లి నిజం అడిగితే మళ్లీ ఫ్రీజ్ అయిపోతాడు. ఇంతలో కార్తీక్, దాసు, స్వప్నలు వస్తారు. మీరేంటి ఇక్కడ అంటే దాసు కాల్ చేసి రమ్మని చెప్పాడని మాట్లాడుతూ ఇలా ఫ్రీజ్ అయిపోతాడు అంటే ఏదైనా సౌండ్ వస్తే ఇలా అయిపోతారని కార్తీక్ అంటాడు. దాసు మళ్లీ పడుకుండిపోతాడు. ఇక జ్యోత్స్న దగ్గరకు పారిజాతం వచ్చి ఎక్కడికి వెళ్లావని అడిగితే ఫ్రెండ్ దగ్గరకు వెళ్లానని అంటుంది. జ్యోత్స్న చెవి పోగు పడిపోతే పారు అడుగుతుంది. దాంతో జ్యోత్స్న కంగారు పడుతుంది. పరుగులు తీస్తుంది.


ఇక దశరథ్ కంగారు పడుతుంటే కార్తీక్ దేనికో భయపడుతున్నావ్ అని అంటాడు. ఇక దశరథ్‌ని తినమని స్వప్న అంటే దశరథ్ సరే అంటాడు. కార్తీక్, కాశీ, దశరథ్‌లకు స్వప్న భోజనం వడ్డిస్తుంది. కార్తీక్ మామయ్యతో రెస్టారెంట్ విషయంలో మీరు నాతో మాట్లాడరు అనుకున్నా అంటాడు. దానికి అది నీ టాలెంట్‌తో దక్కించుకున్నావ్ అని కంగ్రాట్స్ చెప్పి సాయం కావాలి అని అంటే అడుగు అంటాడు. వద్దు మామయ్య నువ్వు సాయం చేస్తా అంటే తాతయ్యకు చెప్పాలి తాత గొడవ పడతాడు వద్దని అంటాడు. అందరూ సరదాగా నవ్వుతూ ఉంటే దశరథ్ ఇలా అందరూ నవ్వుతూ చూసి చాలా రోజులు అయిందని అంటాడు. 


కార్తీక్ ఇంటికి వస్తాడు. దీప నా కోసం తినకుండా ఎదురు చూస్తుంటుంది. స్వప్న ఇంట్లో తినేశానని చెప్పాలి అనుకుంటాడు. ఇంతలో  శౌర్య దిగులుగా కూర్చొని ఉంటే ఏమైంది అంటే నేను బయట వెళ్లి తినబోతే అమ్మ తిట్టిందని అంటాడు. దీప శౌర్యని తిడుతుంది. కార్తీక్‌బాబుని చూసి నేర్చుకో బయట ఎక్కడా తినరు ఆకలి వేసినా ఇంటికి వచ్చే తింటారని అంటాడు. కార్తీక్ మనసులో స్వప్న ఇంట్లో తిన్నాను అని తెలిస్తే నా పని అయిపోతుందని అనుకుంటాడు. ఇక దీప శౌర్యలు కార్తీక్‌ని భోజనానికి పిలుస్తారు. కార్తీక్ చెప్పలేక తిండికి కూర్చొంటాడు.  దీప వడ్చించేస్తుంటే కార్తీక్ ఏం చెప్పలేక తింటున్నట్లు నటిస్తూ శౌర్య ప్లేట్‌లో అన్నం వేసేస్తాడు. ప్లేట్‌లో ఎక్కువ అన్నం చూసిన శౌర్య అమ్మా మళ్లీ అన్నం వేశావేంటి అని అడుగుతుంది.


తల్లీ కూతుళ్లు ఇద్దరూ గొడవ పడతారు. పైకి చూసి కిందకి చూస్తే అన్నం పెరుగుతుందా ఎలా పెరిగింది అని శౌర్య అనకుంటుంది. ఇక కార్తీక్ దీప వెళ్లగానే దీప ప్లేట్‌లో అన్నం వేసేస్తాడు. దీప చూసి నాకు వేసేశావా అని తిడుతుంది. మళ్లీ కార్తీక్ పైకి చూస్తే ఏంటి నాన్న పైకి చూస్తున్నాడు అనుకొని కార్తీక్ ఎటు చూస్తే అటు చూస్తుంది. మళ్లీ కార్తీక్ పాప ప్లేట్‌లో రైస్ వేసేస్తాడు. మళ్లీ అన్నం పెరిగిందని శౌర్య ఆశ్చర్య పడుతుంది. కార్తీక్ ఒక్క ముద్ద నోటిలో పెట్టకుండానే నా భోజనం అయిపోయిందని లేచేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!