Best Smartphone Under Rs 15000: ప్రస్తుతం మార్కెట్లో అనేక 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.15,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో రెడ్‌మీ నుంచి రియల్‌మీ వరకు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మంచి పనితీరుతో పాటు బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ కారణంగా పాపులర్ అయ్యాయి. మీరు రూ. 15,000 లోపు మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే కొన్ని మంచి ఫోన్లు ఇప్పుడు చూద్దాం. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై మీకు బంపర్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
రియల్‌మీ నార్జో 70 5జీ (Realme Narzo 70 5G)
ఈ రియల్‌మీ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 8 జీబీ వరకు ర్యామ్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. అదే సమయంలో ఫోన్ 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇది కాకుండా మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అమెజాన్‌లో రూ.1500 వరకు తగ్గింపు కూడా పొందుతారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ (Samsung Galaxy M15 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీలో వెనకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ. 14,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. అమెజాన్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1000 తగ్గింపు అందిస్తారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)
రెడ్‌మీ లాంచ్ చేసిన ఈ 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంది. దీన్ని అమెజాన్‌లో రూ. 13,998కి కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు మీరు దానిపై రూ. 1000 కూపన్ తగ్గింపును కూడా పొందుతారు.
రియల్‌మీ 12 5జీ (Realme 12 5G)
రియల్‌మీ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందించారు. ఈ ఫోన్ 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ టాప్ వేరియంట్ ధర రూ.14,699గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1250 వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే