Mahindra Thar Discount: మీరు మహీంద్రా థార్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది మీకు సరైన అవకాశం. మహీంద్రా తన అనేక కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.మహీంద్రా పండుగ సీజన్‌కు ముందు భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. మహీంద్రా థార్ వివిధ వేరియంట్‌లపై ఎంత తగ్గింపు అందించనున్నారో ఇప్పుడు చూద్దాం.


థార్ రాక్స్ 5 డోర్ వేరియంట్‌ను విజయవంతంగా లాంచ్ చేసిన తర్వాత మహీంద్రా థార్ 3 డోర్ వేరియంట్‌పై భారీ తగ్గింపును అందించారు. మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షల మధ్య నుంచి రూ. 20.49 లక్షల మధ్య ఉంది. ఇప్పుడు కంపెనీ థార్‌పై రూ.1.5 లక్షల తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు అన్ని 2WD, 4WD పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లపై అందిస్తున్నారు.


ఇది కాకుండా, కంపెనీ ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ400 ఈఎల్ ప్రో వేరియంట్‌పై పెద్ద తగ్గింపును ఇస్తోంది. దీని ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ.17.69 లక్షలుగా ఉంది. మీరు దీనిపై రూ. 3 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ఈసీ, ఈఎల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే!


మహీంద్రా థార్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే... దాని డీజిల్ ఇంజన్ 2184 సీసీ, 1497 సీసీ, పెట్రోల్ ఇంజన్ 1997 సీసీ పవర్‌ని జనరేట్ చేయనుంది. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి థార్ మైలేజ్ లీటర్‌కు 15.2 కిలోమీటర్లుగా ఉండనుంది. థార్ 4 సీటర్ పొడవు 3985 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1820 మిల్లీమీటర్లుగానూ, వీల్‌బేస్ 2450 మిల్లీమీటర్లుగానూ ఉంది.


మహీంద్రా థార్ 3 డోర్ వేరియంట్ 1.5 లీటర్ సీఆర్డీఈ డీజిల్, 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్, 2.0 లీటర్ ఎంస్టాలియన్ పెట్రోల్... ఇలా మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. అయితే 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా థార్ కారుకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఆఫ్ రోడింగ్ చేయాలనుకునే వారికి ఇదే మొదటి ఛాయిస్‌గా మారింది. 






Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!