Asus ROG Zephyrus G16: అసుస్ రోగ్ జెఫైరస్ జీ16 (2024) ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్. ఈ ల్యాప్‌టాప్‌లో 16 అంగుళాల 2.5కే రిజల్యూషన్ అందించారు. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్లతో ఈ ల్యాప్‌టాప్ వచ్చింది. అసుస్ రోగ్ జెఫైరస్ జీ16లో 90డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ ఉంది. అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 16, రోగ్ స్ట్రిక్స్ స్కార్ 18 ల్యాప్‌టాప్‌లను ఐ9 సిరీస్ 13వ తరం ప్రాసెసర్లతో తీసుకువచ్చింది. వీటితో పాటు అసుస్ రోగ్ జీ22 డెస్క్‌టాప్ కూడా వచ్చింది.


అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌ల ధర
అసుస్ రోగ్ జెఫైరస్ జీ16 ల్యాప్‌టాప్‌ ధరను రూ.1,89,990గా నిర్ణయించారు. కొత్త అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 16 ల్యాప్‌టాప్ ధర రూ.2,89,990 నుంచి, అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 18 ధర రూ.3,39,990 నుంచి ప్రారంభం కానుంది. అసుస్ రోగ్ జీ22 డెస్క్‌టాప్ ధర రూ.2,29,990గా ఉంది. అసుస్ ఈ-స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో వీటికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.


అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 16, స్కార్ 18, జెఫైరస్ జీ16 ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే మొదటి 50 మంది కస్టమర్లకు రూ.1కే టీయూఎఫ్ హెచ్3 హెడ్‌సెట్‌ను కాంప్లిమెంటరీగా అందించనుంది కంపెనీ.


అసుస్ రోగ్ జెఫైరస్ జీ16 (2024) స్పెసిఫికేషన్లు
అసుస్ రోగ్ జెఫైరస్ ల్యాప్‌టాప్ విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 16 అంగుళాల 2.5కే డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. ఏఐ ఆధారిత ఇంటెల్ కోర్ 9 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 


ఇందులో 90డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ అందించారు. ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది. కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.85 కేజీలుగా ఉంది.


అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 16, రోగ్ స్ట్రిక్స్ స్కార్ 18, రోగ్ జీ22 స్పెసిఫికేషన్లు
అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 16, రోగ్ స్ట్రిక్స్ స్కార్ 18 ల్యాప్‌టాప్‌లను కంపెనీ రిఫ్రెష్ చేసింది. అసుస్ రోగ్ స్ట్రిక్స్ జీ22 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో కూడా కంపెనీ కొన్ని మార్పులు చేసి రీలాంచ్ చేసింది. అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 16లో 16 అంగుళాల నెబ్యులా హెచ్‌డీఆర్ డిస్‌ప్లేను, రోగ్ స్ట్రిక్స్ స్కార్ 18లో 18 అంగుళాల నెబ్యులా హెచ్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. ఇంటెక్ కోర్ ఐ9 14900హెచ్ఎక్స్ ప్రాసెసర్‌పై ఇవి రెండూ పని చేయనున్నాయి. 64 జీబీ వరకు డీడీఆర్5 ర్యామ్, 4 టీబీ పీసీఐఈ స్టోరేజ్ ఇందులో ఉంది. ఈ రెండు మోడల్స్‌లోనూ 90డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీనే అందుబాటులో ఉంది.


అసుస్ రోగ్ జీ22 డెస్క్‌టాప్‌ను కూడా కంపెనీ రిఫ్రెష్ చేసింది. ఇందులో ఇంటెల్ ఐ7 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. 32 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండటం విశేషం. ముందువైపు ప్యానెల్లో ఆర్జీబీ లైటింగ్ ఉండటం విశేషం. డాల్బీ అట్మాస్, ఏఐ నాయిస్ కాలింగ్ టెక్నాలజీ కూడా అందించారు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?