WhatsApp Unknown Number Calls: వాట్సాప్‌లో చాలా మంది యూజర్లకు విదేశీ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఈ కాల్స్ లేదా మెసేజ్‌లకు అజాగ్రత్తగా రెస్పాండ్ అయితే మీరు స్కామ్‌కు గురి అయ్యే అవకాశం ఉంది.


కొంత కాలం క్రితం కూడా తమకు విదేశీ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని ట్విట్టర్‌లో వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీని తర్వాత అలాంటి కాల్‌లను పట్టించుకోవద్దని వినియోగదారులను కోరుతూ వాట్సాప్ ప్రకటన విడుదల చేసింది. మీకు తెలియని నంబర్ నుంచి సందేశం లేదా కాల్ వచ్చినట్లయితే వాటికి స్పందించకుండా ఉండటమే మంచిది.


మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి దేశాల నంబర్ల నుంచి చాలా మంది వాట్సాప్ వినియోగదారులకు కాల్స్ వస్తున్నాయి. మీరు కొత్త సిమ్ తీసుకున్నట్లయితే ఈ కాల్స్ మరింత ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కాల్స్ ఉద్దేశ్యం ఏమిటో తెలియదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా వాట్సాప్ యూజర్లకు విదేశీ నంబర్ల నుండి కాల్స్ వస్తే వారు వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని వాట్సాప్ కోరింది. తద్వారా కంపెనీ ప్లాట్‌ఫారమ్ నుంచి అలాంటి నంబర్‌లను తొలగించవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


ఏఐ ద్వారా కాల్స్ చేస్తున్న నంబర్లను గుర్తించే పనిలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తద్వారా వాటిని బ్లాక్ చేయవచ్చు. వినియోగదారుల భద్రతను కాపాడేందుకు మే నెలలో ప్లాట్‌ఫారమ్ నుంచి 65 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.


విదేశీ నంబర్లను వెంటనే బ్లాక్ చేయండి
మీకు ఎప్పుడైనా విదేశీ నంబర్ నుంచి మెసేజ్ లేదా కాల్ వచ్చినట్లయితే వెంటనే దాన్ని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. బ్లాక్ చేయడానికి ఆ నంబర్‌లోని చాట్ సెగ్మెంట్‌లోకి వెళ్లి, పైన కనిపించే మూడు చుక్కల ఎంపికపై క్లిక్ చేయండి. అక్క బ్లాక్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు కావాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి కూడా ఈ పనిని చేయవచ్చు. ఇది కాకుండా మీరు యాప్‌లో తెలియని నంబర్ల కోసం మరో సెట్టింగ్‌ను కూడా ఆన్ చేయవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌ని ఆన్ చేసిన వెంటనే, తెలియని నంబర్‌ల నుండి వచ్చే కాల్స్ ఆటోమేటిక్‌గా సైలెంట్ అయిపోతాయి. మీరు అనవసరమైన కాల్స్ తీయాల్సిన అవసరం లేదు.


మెసేజింగ్ యాప్ వాట్సాప్ రానున్న కాలంలో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతుంది. మెసేజింగ్ యాప్‌లో యానిమేటెడ్ అవతార్ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా కోసం డెవలప్ చేస్తున్నారు. WABetaInfo కథనం ప్రకారం వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ వినియోగదారుల ఇంటరాక్షన్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదే వాట్సాప్ యానిమేటెడ్ ఫీచర్.


ఈ అప్‌డేట్ కోసం కంపెనీ రెండు ప్రధాన కరెక్షన్‌లను ప్రకటించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. మొదటి కరెక్షన్ ఏమిటంటే ఫొటో తీయడం ద్వారా మీ అవతార్‌ను కాన్ఫిగర్ చేయగల సామర్థ్యం ఉంటుంది. దీంతో అవతార్ ప్రక్రియను ఆటోమేట్ అవుతుంది. రెండోది యాప్ సెట్టింగ్స్ నుంచి నేరుగా వారి అవతార్ కాన్ఫిగరేషన్‌ను సెట్ చేసిన వినియోగదారులందరికీ కొత్త అవతార్ల కలెక్షన్ (వాట్సాప్ యానిమేటెడ్ అవతార్స్) ఆటోమేటిక్‌గా రోల్ అవుట్ అవుతుంది.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial