Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?

Apple Scary Fast Event: యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం కానుంది.

Continues below advertisement

Apple Scary Fast Event: యాపిల్ ‘స్కేరీ ఫాస్ట్’ ఈవెంట్ అమెరికాలో అక్టోబర్ 30వ తేదీన (భారతీయ కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున) జరగనుంది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. యాపిల్ ఈ ఈవెంట్‌లో కంపెనీ తన కొత్త కంప్యూటర్ మాక్ బుక్ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. దాని గురించి యాపిల్ టీజర్ ద్వారా సమాచారం ఇచ్చింది. యాపిల్ తన ఈవెంట్‌ను సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) నిర్వహించడం ఇదే మొదటిసారి అని మీకు తెలియజేద్దాం.

Continues below advertisement

'స్కేరీ ఫాస్ట్' ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడటం ఎలా?
యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌ను నవంబర్ 31వ తేదీ ఉదయం 5.30 గంటలకు భారతదేశంలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ ఈవెంట్ యాపిల్ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్‌లో జరగనుంది. మీరు యాపిల్ అధికారిక సైట్, కంపెనీ యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ ప్లస్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. దీంతో పాటు మీరు యాపిల్ సోషల్ మీడియా పేజీలో కూడా 'స్కేరీ ఫాస్ట్' ఈవెంట్‌ను చూడవచ్చు.

స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో ప్రత్యేకత ఏమిటి?
ఈ యాపిల్ ఈవెంట్ కోసం డిజిటల్ ఇన్విటేషన్‌ను కంపెనీ జారీ చేసింది. దీనిలో మీరు ‘యాపిల్ పీపుల్’పై క్లిక్ చేసిన వెంటనే వారు ‘మ్యాక్‌బుక్ పీపుల్’గా రూపాంతరం చెందుతారు. మంగళవారం యాపిల్ దాని ఎం3 ప్రాసెసర్‌తో కూడిన మ్యాక్‌బుక్‌ కంప్యూటర్‌ను లాంచ్ చేయనుందని స్పష్టం చేసింది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో అందించిన ఏ17 ప్రో ప్రాసెసర్ మాదిరిగానే ఇది 3 ఎన్ఎం ప్రాసెస్‌లో తయారు అయిన కంపెనీ మొదటి ప్రాసెసర్.

ఈ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ కొత్త ఐమ్యాక్‌ను కూడా ప్రకటించవచ్చు. కంపెనీ 2021లో లాంచ్ చేసిన మోడల్‌కి ఇది మొదటి అప్‌గ్రేడ్ కావచ్చు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొత్త ఐమ్యాక్‌లో పనితీరు పరంగా పెద్ద మార్పులు ఉండవచ్చు. అయితే డిజైన్‌లో ఎటువంటి మార్పులు ఉంటాయో తెలియరాలేదు.

మరో వైపు టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను అసెంబుల్ చేసే విస్ట్రాన్ ప్లాంట్‌ను ఇటీవలే కొనుగోలు చేసింది. ఇక ఐఫోన్‌ను టాటా గ్రూప్ భారత్‌లో ఉత్పత్తి చేసి అసెంబుల్ చేయనుందని అక్టోబర్ 27వ తేదీన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్/ట్విట్టర్ ద్వారా ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ డీల్ ద్వారా భారతదేశంలో ఐఫోన్ రేట్లు తగ్గుతాయో లేదో చూడాలంటే ప్రొడక్ట్ తయారయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే. విస్ట్రాన్ ఫ్యాక్టరీ విలువ సుమారు 125 మిలియన్ డాలర్లు అని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా టాటా గ్రూప్, విస్ట్రాన్ మధ్య ఈ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement