యాపిల్ తన కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ను లాంచ్ చేసింది. దీంతోపాటు కొత్త ఐప్యాడ్ మినీ 6 కూడా లాంచ్ అయింది. ఇందులో ఏ13 బయోనిక్ చిప్ ను అందించారు. ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల కంటే ఆరు రెట్లు వేగంగా ఈ ట్యాబ్లెట్ పనిచేయనుందని యాపిల్ తెలిపింది.
కొత్త ఐప్యాడ్. ఐప్యాడ్ మినీ 6 ధర
కొత్త ఐప్యాడ్ ధర మనదేశంలో రూ.30,900 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.30,900గా ఉండనుంది. వైఫై + సెల్యులార్ మోడల్ ధర రూ.42,900గా నిర్ణయించారు. స్టోరేజ్ మోడల్స్ 64 జీబీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్పేస్ గ్రే, సిల్వర్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.
ఇక ఐప్యాడ్ మినీ 6 ధర రూ.46,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది వైఫై ఓన్లీ వేరియంట్ ధర. వైఫై + సెల్యులార్ మోడళ్ల ధర రూ.60,900 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 64 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. బ్లాక్, వైట్, డార్క్ చెర్రీ, ఇంగ్లిష్ లావెండర్, ఎలక్ట్రిక్ ఆరెంజ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటి సేల్ అమెరికాలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయో తెలియరాలేదు.
కొత్త ఐప్యాడ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 10.2 అంగుళాల డిస్ ప్లేను అందించారు. గతంలో లాంచ్ అయిన ఐప్యాడ్ మోడళ్లలో కూడా ఈ తరహా డిస్ ప్లేనే అందించారు. ఇందులో ఏ13 బయోనిక్ చిప్ ను అందించారు. ఈ బయోనిక్ చిప్ ను మొదట ఐఫోన్ 11తో పరిచయం చేశారు. దీంతోపాటు ఇందులో న్యూరల్ ఇంజిన్ కూడా అందించారు.
కొత్త ఐప్యాడ్ లో సరికొత్త కెమెరా సెటప్ ను యాపిల్ అందించింది. ఇందులో ముందువైపు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూని ఇది అందించింది. సెంటర్ స్టేజ్ ఫీచర్ ను కూడా ఇందులో అందించారు. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను యాపిల్ ఇందులో అందించింది.
ఇందులో టచ్ ఐడీ హోం బటన్ ఉండనుంది. అయితే స్మార్ట్ కీబోర్డు వంటి యాపిల్ యాక్సెసరీలు కూడా దీంతోపాటు అందించనున్నారు. ఇది థర్డ్ పార్టీ కీబోర్డులను కూడా సపోర్ట్ చేయనుంది.
ఐప్యాడ్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. వైఫై ఓన్లీ, వైఫై + 4జీ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. 20W యూఎస్ బీ టైప్-సీ పవర్ అడాప్టర్ ను కూడా దీంతోపాటు అందించారు.
ఐప్యాడ్ మినీ 6 స్పెసిఫికేషన్లు
కొత్త ఐప్యాడ్ తరహాలో కాకుండా ఇందులో 8.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ ప్లేను అందించారు. ఇందులో ఏ15 బయోనిక్ చిప్ ను అందించారు. గతంలో లాంచ్ అయిన ఐప్యాడ్ల కంటే ఏకంగా 80 శాతం వేగంగా ఈ ఐప్యాడ్ పనిచేస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఐప్యాడ్ ప్రో తరహాలో సెంటర్ స్టేజ్ ను ఇది కూడా సపోర్ట్ చేయనుంది.
దీంతోపాటు వెనకవైపు కూడా 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ట్రూటోన్ ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇందులో స్టీరియో స్పీకర్లను కంపెనీ అందించింది. వైఫై 6, బ్లూటూత్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ-సిమ్ సపోర్ట్, గిగాబిట్ ఎల్టీఈ, 5జీలను ఇది సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 20W యూఎస్ బీ టైప్-సీ అడాప్టర్ ను అందించారు.
Also Read: Apple Watch Series 7: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు!
Also Read: ఈ సంవత్సరం వన్ ప్లస్ లాంచ్ చేయనున్న చివరి ఫోన్ ఇదే.. ధర కూడా లీక్!
Also Read: Samsung New Phone: శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఆ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్!