బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి కోర్టు మరోసారి షాకిచ్చింది. ప్రముఖ పాటల రచయిత, కవి జావేద్ అక్తర్ వేసిన డిఫమేషన్ కేసులో కంగనా విచారకు హాజరు కాకపోవడంతో ముంబై మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా కోర్టుకి రాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఆమెకి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. 


Also Read : చనిపోతే డబ్బులివ్వడం.. రేషన్ ఇవ్వడం కాదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్..


అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అక్తర్ హాజరు కాగా.. నటి కంగనా మాత్రం హాజరు కాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టుని అభ్యర్ధించింది. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు అనిపిస్తుందని కోర్టు మండిపడింది. 


ఇకపై ఇలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కోర్టు చెప్పింది. వచ్చే విచారణకు తప్పకుండా హాజరు కావాలని.. లేదంటే అరెస్ట్ వారెంట్ తప్పదంటూ తేల్చి చెప్పింది. కంగనా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కంగనా సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉండడం పాటు.. కోవిడ్ లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారని.. ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకి తెలిపారు. 


అసలు కంగనాపై జావేద్ ఈ కేసు ఎందుకు పెట్టారంటే.. సుశాంత్ రాజ్ పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగనా అకారణంగా తన గురించి మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టుని ఆశ్రయించింది కంగనా. అయితే కంగనా పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. 


Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సైఫ్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కాదు, బిగ్ స్క్రీన్‌పైనే ‘ఆదిపురుష్’ అంటూ హింటిచ్చిన రావణుడు!


Also Read : ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..


Also Read: విశ్వ ఏమిటా ఏడుపు? ‘బిగ్ బాస్’ సీజన్ 5లో ‘పాతాళగంగ’ అవార్డుకు అబ్బాయిలు పోటీ?


Also read: నటరాజ్ చెప్పిన ఆ గుంట నక్క రవియేనా..?


Also Read: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ