ఐఫోన్-14 సిరీస్ విడుదల
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్.. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరికొత్త ఐఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series)ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్ కింద Apple iPhone 14 Pro, 14 Pro Max ను పరిచయం చేసింది. ఈ రెండు ఫోన్‌లలో కంపెనీ పిల్ ఆకారపు నాచ్ ని యూజ్ చేసింది. కొత్త ట్రూ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. ఇది డైనమిక్ ఐలాండ్ నోటిఫికేషన్‌లతో వస్తుంది. ఐఫోన్ 14 ప్రోలో కొత్త యాక్షన్ మోడ్ ఇవ్వబడింది. ఇందులో 4K వీడియో, డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభ ధర రూ.79,990గా ఫిక్స్ చేసింది కంపెనీ.
పలు ఫోన్ల అమ్మకాల నిలిపివేత
ఆపిల్ 14 సిరీస్ విడుదల నేపథ్యంలో ఆపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అటు iPhone 12 Mini, iPhone 13 Pro, 13 Pro Maxలను సైతం నిలిపివేసింది. GizmoChina నివేదిక ప్రకారం, టెక్ దిగ్గజం అవుట్ గోయింగ్ ప్రో మోడళ్లను ఆపిల్ ఐఫోన్ లైనప్‌లో కొత్త ప్రో మోడల్‌లను ప్రతి సంవత్సరం లాంచ్ చేస్తుంది. iPhone 12 Mini, iPhone 13 Pro, 13 Pro Max మోడల్‌ల విక్రయాన్ని Apple అధికారికంగా నిలిపివేసింది. అయితే స్టాక్‌లు ఉన్నంత వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిటైలర్ల నుండి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
నిలిపివేసిన ఐఫోన్ల ప్రత్యేకతలు
ఐఫోన్ 13 ప్రో సిరీస్ కొన్ని మేజర్ అప్ గ్రేడ్స్ తో వచ్చింది ఆపిల్ కంపెనీ. ఈ సిరీస్ లోని ఫోన్లు 120Hz LTPO డిస్‌ప్లే, మెరుగైన ట్రిపుల్ కెమెరా సిస్టమ్, మెరుగైన బ్యాటరీ లైఫ్ సహా పలు ఫీచర్‌లను పరిచయం చేసింది. ఐఫోన్ 12 మినీని 2020 నుంచి నిలిపివేసింది. ఇది మొదటి మినీ ఐఫోన్. OLED డిస్‌ప్లేతో వచ్చే అత్యంత సరసమైన ఐఫోన్. అటు 2019 నుంచి iPhone 11ని నిలిపివేసింది. ఇది డ్యూయల్-కెమెరా సెటప్, 4GB RAM, 18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొదటి బేస్ ఐఫోన్. తాజాగా యాపిల్ 'ఫార్ అవుట్ ఈవెంట్'లో Apple iPhone 14 సిరీస్‌ను ఆవిష్కరించింది. వీటితో పాటు AirPods Pro 2nd Gen, Apple Watch Series 8, Apple Watch Ultra ఉన్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఫోన్లపై భారత్ లో ధర తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది.
Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?