Android 15 Update in Motorola Smartphones: అమెరికన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటొరోలా గత కొన్నేళ్లుగా తన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఆలస్యం చేయడంపై విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే 2024 సంవత్సరం వారికి ప్రతి విషయంలోనూ చాలా బాగానే ఉంది. ఈ సంవత్సరంలో మోటొరోలా కంపెనీ తన ఫోన్ల హార్డ్‌వేర్, స్పెసిఫికేషన్‌లను మెరుగుపరచడమే కాకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సమస్యను కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను పొందే ఫోన్లు ఇవే...
మోటరోలా తన అనేక స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం గూగుల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను విడుదల చేసిందని, ఇది అనేక గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లో విడుదల అయిందని తెలుసుకుందాం.
ఇప్పుడు పిక్సెల్ ఫోన్ తర్వాత శాంసంగ్ సహా అన్ని ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల కంటే ముందు మోటొరోలా ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను రోల్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అధికారిక సపోర్ట్ పేజీ నుంచి దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది కింద పేర్కొన్న మోటొరోలా ఫోన్లు ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ అప్‌డేట్‌ను పొందబోతున్నాయి.
మోటొరోలా రేజర్ సిరీస్ ఫోన్లు
మోటొరోలా రేజర్+ (2024) / మోటొరోలా రేజర్ 50 Ultra
మోటొరోలా రేజర్ (2024) / మోటొరోలా రేజర్ 50
మోటొరోలా రేజర్+ (2023) / మోటొరోలా రేజర్ 40 Ultra
మోటొరోలా రేజర్ (2023) / మోటొరోలా రేజర్ 40
మోటొరోలా ఎడ్జ్ ఫోన్లు
మోటరోలా ఎడ్జ్ (2024)
మోటొరోలా ఎడ్జ్+ (2023)
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా
మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో
మోటొరోలా ఎడ్జ్ 50 నియో
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్
మోటరోలా ఎడ్జ్ 50
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
మోటొరోలా మోటో జీ సిరీస్ ఫోన్లు
మోటొరోలా మోటో జీ పవర్ 5జీ (2024)
మోటొరోలా మోటో జీ స్టైలస్ 5జీ (2024)
మోటొరోలా మోటో జీ 5జీ (2024)
మోటొరోలా మోటో జీ8 ప్లస్
మోటొరోలా మోటో జీ75
మోటొరోలా మోటో జీ5
మోటొరోలా మోటో జీ45
మోటొరోలా మోటో జీ35
మోటొరోలా మోటో జీ34 5జీ
ఇతర మోటొరోలా ఫోన్లు
థింక్‌ఫోన్ బై మోటొరోలా
థింక్‌ఫోన్ (2025)
పైన పేర్కొన్న ఈ ఫోన్‌లలో, కంపెనీ ముందుగా ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ అప్‌డేట్‌ను ఇవ్వబోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్(పాత పేరు ట్విట్టర్)లో ఒక భారతీయ యూజర్ ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లో విడుదల చేయడం ప్రారంభించిదని ఒక స్క్రీన్‌షాట్ ద్వారా ప్రకటించారు.
ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను పొందుతున్న ఫోన్‌ల జాబితా మోటొరోలా అధికారిక సపోర్ట్ పేజీలో కనిపించింది. దీని అర్థం ఇప్పుడు మోటొరోలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల విషయంలో కూడా తన అభిమానులను సంతోషపెట్టడానికి సన్నాహాలు చేసింది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే