Android 15 Google Pixel: ఆండ్రాయిడ్ 15 ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. దీని ఎంట్రీ కోసం ఎన్నో రోజుల నుంచి యూజర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది గూగుల్ పిక్సెల్ డివైసెస్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 15లో ప్రైవేట్ స్పేస్ ఫీచర్ అందించారు. దీని కారణంగా వినియోగదారులు తమ డివైస్‌లో ప్రైవేట్ స్పేస్‌ని క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తాయి. ఆండ్రాయిడ్ 15తో వినియోగదారులు సెట్టింగ్స్ యాప్ నుంచి నేరుగా ఆర్కైవ్ చేయడం, రీస్టోర్ చేయడం వంటివి చేయవచ్చు.
అయితే ప్రస్తుతానికి అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 15 అందుబాటులో లేదు. గూగుల్ పిక్సెల్‌కు సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్ ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. మీ దగ్గర గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లేకపోతే... ఆండ్రాయిడ్ 15 కోసం మీరు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. త్వరలో చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ సదుపాయాన్ని పొందుతాయి. ఏ గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి రానుందో ఇప్పుడు చూద్దాం.
ఈ స్మార్ట్‌ఫోన్‌ల్లోనే ఆండ్రాయిడ్ 15...
గూగుల్ పిక్సెల్ 6
గూగుల్ పిక్సెల్ 6 ప్రో
గూగుల్ పిక్సెల్ 6ఏ
గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7 ప్రో
గూగుల్ పిక్సెల్ 7ఏ
గూగుల్ పిక్సెల్ 8
గూగుల్ పిక్సెల్ 8 ప్రో
గూగుల్ పిక్సెల్ 9
గూగుల్ పిక్సెల్ 9 ప్రో
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్
పిక్సెల్ టాబ్లెట్
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ఇతర పరికరాలకు ఆండ్రాయిడ్ 15 ఎప్పుడు వస్తుంది?
మీ దగ్గర గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లేకుండా ఆండ్రాయిడ్ 15 కోసం వేచి ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ 15 త్వరలో నథింగ్, వన్‌ప్లస్, షార్ప్, ఒప్పో, రియల్‌మీ, టెక్నో, వివో, షావోమీ, హానర్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులోకి ఉంటుందని గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈ డివైస్‌లో 2024 తర్వాత స్టేబుల్ అప్‌డేట్‌లను పొందుతాయి.
ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసా?
1. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
2. ఇక్కడ మీరు సిస్టమ్ అప్‌డేట్‌కి వెళ్లాలి
3. ఆపై మీరు ఆండ్రాయిడ్ 15ని డౌన్‌లోడ్ చేయడానికి బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఇన్‌స్టాల్ చేయవచ్చు. ప్రస్తుతం లాంచ్ అవుతున్న చాలా వరకు స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ అందుబాటులో ఉంది. కొన్నాళ్లు పోతే చాలా స్మార్ట్ ఫోన్లు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అవుతాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?