వాట్సాప్ వినియోగదారులకు మరో ముప్పు  తలెత్తింది. యూజర్ల డేటా, గోప్యత దెబ్బతీసే  మాల్వేర్‌ తో వాట్సాప్ నాక్-ఆఫ్‌ లు దెబ్బతిన్నాయని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు కాస్పర్‌స్కీ కనుగొన్నారు. YoWhatsApp వెర్షన్ 2.22.11.75లో Trojan.AndroidOS.Triada.eq అని పిలువబడే హానికరమైన మాడ్యూల్‌ ను ఆయన గుర్తించారు. ఈ మాడ్యూల్ వినియోగదారుల ఫోన్లలోని మాల్వేర్‌ ను డీక్రిప్ట్ చేస్తుందని వెల్లడించారు. ఈ మాడ్యూల్ WhatsApp పని చేయడానికి అవసరమైన పలు రకాల ముఖ్యమైన కీలను దొంగిలిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాప్ లేకుండా WhatsApp అకౌంట్ ను ఉపయోగించడానికి అనుమతించే ఓపెన్ సోర్స్ యుటిలిటీలలో సైబర్ నేరగాళ్లకు ఈ కీలు చాలా ఉపయోగపడతాయన్నారు. కీలు దొంగిలించబడినట్లయితే, WhatsAppపై వినియోగదారులు నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.  


YoWhatsAppతో జాగ్రత్త!


WhatsApp నాక్‌ఆఫ్ – YoWhatsApp  హానికరమైన మోడ్‌ ను కలిగి ఉన్నట్లు సైబర్ నిపులణులు గుర్తించారు. YoWhatsApp అనేది ఫుల్లీ వర్కింగ్ మెసెంజర్. కస్టమైజ్డ్ ఇంటర్‌ ఫేస్‌ను కలిగి ఉండటంతో పాటు వ్యక్తిగత చాట్‌లకు యాక్సెస్‌ను నిరోధించడం వంటి కొన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. దీన్ని ఫోన్లలో ఇన్‌ స్టాల్ చేసినప్పుడు.. అసలు WhatsApp మెసెంజర్ మాదిరిగానే SMSకి యాక్సెస్ సహా పలు అనుమతులను అడుగుతుంది. ఈ సమయంలోనే ట్రయాడా ట్రోజన్ లాంటి మాల్వేర్‌లకు సైలం అనుమతులు ఇవ్వబడుతాయి. ఇదే అదునుగా ఈ మాల్వేర్‌ వినియోగదారుకు తెలియకుండానే పెయిడ్ సబ్ స్ర్కిప్షన్ యాడ్ చేస్తాయి. Kaspersky చేసిన చెక్ అప్ ప్రకారం, అధికారిక స్నాప్‌ ట్యూబ్ యాప్ (MD5: C3B2982854814E537CD25D27E295CEFE)లో వినియోగదారు WhatsApp ప్రకటనలపై క్లిక్ చేసినప్పుడు, హానికరమైన బిల్డ్‌ ను ఇన్‌స్టాల్ చేయమని పాపప్ వస్తుందని తెలిపింది. దానిని యాక్సెస్ట్ చేస్తే ప్రమాదకరమైన మాల్వేర్ వాట్సాప్ డేటాను కొల్లగొడుతున్నట్లు వెల్లడించింది.


Read Also: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!


మాల్వేర్ నుంచి ఎలా కాపాడుకోవాలంటే?


వాట్సాప్ అధికారిక యాప్ మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలి. Google Play Store, App Store నుంచి మాత్రమే వీటిని మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవడం మంచింది. . ఒకవేళ మీరు నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినట్లయితే, వెంటనే దాన్ని మీ ఫోన్ నుండి అన్ ఇన్ స్టాల్ చేయడం ఉత్తమం.  అలాగే, యాప్‌ని మీ స్మార్ట్‌ ఫోన్‌ లో డౌన్‌ లోడ్ చేసే ముందు ఎల్లప్పుడూ  అనుమతులను కచ్చితంగా తనిఖీ చేయడం మంచింది.   


GB WhatsApp చాలా డేంజర్!


తాజాగా సైబర్‌ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ESET తన తాజా థ్రెట్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.   WhatsApp నుంచి  క్లోన్ చేయబడిన, థర్డ్ పార్టీ యాప్ GB WhatsApp దేశంలోని వినియోగదారుల చాట్‌లపై గూఢచర్యం చేస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ క్లోన్ చేయబడిన యాప్ Google Play Storeలో అందుబాటులో లేదు. కేవలం వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.  అందుకే వినియోగదారులు ఫేక్ వాట్సాప్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.