కోట్లాది మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp. ఈ. యాప్ ఇప్పటికే మెసేజింగ్, కాలింగ్, వీడియో కాలింగ్, చెల్లింపులు సహా అనేక ఉపయోగకరమైన ఫీచర్‌లను అందిస్తుంది. అయితే, ఈ ప్లాట్ ఫామ్ పరిచయం చేయాలని వినియోగదారులు కోరుకునే కొన్ని ఫీచర్లు ఉన్నాయి. కానీ, ఇంకా అవి అందుబాటులోకి రాలేదు. అలాంటి వాటిలో ఒకటి.. సేవ్ చేయని నెంబర్ కు మెసేజ్ పంపడం. వాస్తవానికి ఇలా మెసేజ్ పంపడం అనే ఫీచర్ వాట్సాప్ లో లేదు.
వాట్సాప్ లో మీరు ఎవరితోనైనా చాట్ చేయాలనుకుంటే, మీరు ముందుగా వారి కాంటాక్ట్ ను సేవ్ చేయాలి. ఆ తర్వాతే వారితో మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, మీరు ఎవరికైనా తెలియని వారికి లేదంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో లేని వారికి మెసేజ్ పంపాలనుకుంటే.. కొన్ని ట్రిక్స్ ద్వారా సాధ్యం అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెబ్ బ్రౌజర్ ద్వారా మెసేజ్ పంపవచ్చు
- మీ ఫోన్‌లో ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత "http://wa.me/91xxxxxxxxx" లింక్‌ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. (దేశం కోడ్ తో ఫోన్ నంబర్‌ను 'XXXXX'లో టైప్ చేయండి, ఉదా- "https://wa.me/991125387".
- నంబర్‌ను టైప్ చేసిన తర్వాత, లింక్ ను తెరవడానికి ఎంటర్ నొక్కండి.
- మీరు WhatsApp స్క్రీన్ లోకి వెళ్తారు. "చాట్ కొనసాగించు" అని ఉండే గ్రీన్ బటన్‌పై క్లిక్ చేయండి.
- మీరు మెసేజ్ పంపాలనుకున్న మొబైల్ నంబర్ యొక్క వాట్సాప్ చాట్ విండో తెరవబడుతుంది.
- ఇప్పుడు మీరు వారికి మెసేజ్ పంపండి.
Truecallerని ఉపయోగించి మెసేజ్ పంపవచ్చు
- మీరు ట్రూకాలర్‌ని ఉపయోగిస్తుంటే.. కాంటాక్ట్ నంబర్‌ను సేవ్ చేయకుండా నేరుగా మెసేజ్ చేయడం సాధ్యం అవుతుంది.
- ముందుగా Truecaller యాప్ ఓపెన్ చేయండి.
- సెర్చ్ బార్ లో మీరు చాట్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఫోన్ నంబర్ ను టైప్ చేయండి.
- ఆ వ్యక్తి యొక్క ట్రూకాలర్ ప్రొఫైల్ తెరవబడుతుంది.
- ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేయండి.
- ప్రొఫైల్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బటన్‌పై నొక్కండి.
- వాట్సాప్ చాట్ విండో ఓపెన్ అవుతుంది.
- మీరు ఇప్పుడు నంబర్ ను సేవ్ చేయకుండానే మెసేజ్ ను పంపవచ్చు.
Siri షార్ట్ కట్ ద్వారా మెసేజ్ పంపవచ్చు (ఐఫోన్ యూజర్లు మాత్రమే)
- ఐఫోన్ వినియోగదారుల కోసం, వాట్సాప్‌లో సేవ్ చేయని కాంటాక్ట్‌కి మెసేజ్ చేసే ట్రిక్ ఉంది.
- మీ iPhoneలో Apple షార్ట్ కట్ల యాప్ ఓపెన్ చేయండి.
- ‘యాడ్ షార్ట్ కట్’ బటన్‌పై నొక్కండి.
- ఇప్పుడు WhatsApp నుంచి నాన్-కాంటాక్ట్ షార్ట్ కట్ ను ఇన్ స్టాల్ చేయండి.
- ఆ తర్వాత షార్ట్ కట్ ను రన్ చేయడానికి టా ప్ చేయండి.
- ఆ తర్వాత ‘చూజ్ రిసీపియెంట్’ అనే పాప్ అప్ కనిపిస్తుంది.
- అప్పుడు కంట్రీ కోడ్ తో నంబర్‌ను టైప్ చేయండి.
- WhatsApp చాట్ విండో ఓపెన్ అవుతుంది. మెసేజ్ పంపుకోవచ్చు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?