ఐపీఎల్ రెండో దశ యూఏఈలో ఆదివారం(సెప్టెంబర్ 19వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. తమ జట్టు ప్రాక్టీస్ వీడియోను అధికారిక యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆర్సీబీ ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మాట్లాడాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండటంతో తన ఉత్సాహం రెట్టింపు అయిందని చాహల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఆర్సీబీ 10 పాయింట్లు సాధించింది.


ఈ ఫీలింగ్ చాలా బాగుందని, ఒత్తిడి కూడా అంతగా లేదని చాహల్ అన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి స్థానంలోనే ఉన్నామని, టేబుల్ టాప్‌కు వెళ్లడానికి కూడా తమకు మంచి అవకాశం ఉందని తెలిపాడు. నెట్స్‌లో బాగా బౌలింగ్ వేసినప్పుడు మంచిగా అనిపిస్తుందని, పాత యజ్వేంద్ర చాహల్ బయటకు వచ్చినట్లు తనకు తెలుస్తుందన్నాడు.


ఐపీఎల్ 14వ సీజన్ భారత్‌లో జరుగుతూ ఉండగానే.. పలువురు ఆటగాళ్లకు కరోనావైరస్ సోకడంతో వాయిదా పడింది. మిగిలిన టోర్నీ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. మొదటిమ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీ పడనుంది.


విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్స్‌కు దేవ్‌దత్ పడిక్కల్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. హర్షల్ పటేల్ 17 వికెట్లలో పర్పుల్ క్యాప్‌తో ఉండగా, ఆర్సీబీకే చెందిన మరో బౌలర్ కైల్ జేమీసన్ 9 వికెట్లతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.


ఆర్సీబీ తన మొదటిమ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీ పడనుంది. సెప్టెంబర్ 20వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 24వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో కోహ్లీ సేన పోటీ పడనుంది. మొత్తం 31 మ్యాచ్‌ల్లో 13 దుబాయ్‌లో, 10 మ్యాచ్‌లు షార్జాలో, 8 మ్యాచ్‌లు అబుదాబిలో జరగనున్నాయి.


ఐపీఎల్ స్మూత్‌గా జరగడానికి 46 పేజీల హెల్త్ అడ్వైసరీని బీసీసీఐ అందించింది. దీన్ని ఐపీఎల్‌లో భాగమైన అందరూ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మొత్తం అన్ని జట్లూ ఐపీఎల్ కోసం ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. 


Also Read: Team India New Coach Application: కోచ్‌గా దిగిపోయేందుకు సిద్ధమైన రవిశాస్త్రి? రాహుల్‌ ద్రవిడ్‌ రాక తప్పదా!
Also Read: IPL 2021: 'అతనో బ్యాటింగ్‌ రాక్షసుడు!'.. బుమ్రా బౌలింగ్‌ను చితకబాదేస్తాడన్న గంభీర్‌
Also Read: Deepak Chahar: అతడు వన్‌డౌన్‌కు ప్రమోట్‌ చేయడంతో అర్ధశతకం బాదేశాను.. ధోనీది సాయం చేసే గుణం
Also Read: CSK Captain: ఎంఎస్ ధోనీ తరువాత సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి.. ఎల్లో ఆర్మీలో గుబులు.. నేనే అంటున్న సీనియర్ క్రికెటర్!