UP Warriorz Vs Gujarat Giants, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు ఓ మోస్తరు స్కోరు సాధించింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హరీన్ డియోల్ (46: 32 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా బెత్ మూనీ ఈ మ్యాచ్‌కు దూరం అయింది. దీంతో భారత బౌలర్ స్నేహ్ రాణా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24: 15 బంతుల్లో, ఐదు ఫోర్లు), సోఫీ డంక్లే (13: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 3.5 ఓవర్లలో 34 పరుగులు సాధించారు.
అయితే ఆ తర్వాత ఇన్నింగ్స్ కొంచెం నిదానించింది. అన్నాబెల్ సదర్లాండ్ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్), సుష్మ వర్మ (9: 13 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. కానీ ఒక ఎండ్‌లో హర్లీన్ డియోల్ (46: 32 బంతుల్లో, ఏడు ఫోర్లు) నిలబడి ఆడింది. అయితే తనకు యాష్లే గార్డ్‌నర్ (25: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తోడయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 29 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ రెండు ఓవర్ల వ్యవధిలోనే అవుట్ అయ్యారు.
కానీ చివర్లో దయాళన్ హేమలత (21: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో గుజరాత్ 50 పరుగులకు పైగా సాధించింది. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంజలి శర్వాణి, టహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ దక్కించుకున్నారు.
యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI)
అలిస్సా హీలీ(కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయక్వాడ్
గుజరాత్ జెయింట్స్ (ప్లేయింగ్ XI)
సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, స్నేహ రాణా(కెప్టెన్), తనుజా కన్వర్, మాన్సీ జోషి