IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సంబంధించి ప్రజల మదిలో అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. జనవరి 10వ తేదీ నుంచి జరగనున్న ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నలను మరింత పెంచాడు. వన్డే సిరీస్‌కు సంబంధించి మరోసారి ఎడమచేతి వాటం ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తారని అభిమానులు ఆశించారు. అయితే వన్డే సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్‌ను కాదు, శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంటారని రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశాడు.
ఇషాన్ కిషన్ మరో కరుణ్ నాయర్ లాగా అవుతాడా?
రోహిత్ శర్మ సమాధానం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి డబుల్ సెంచరీ సరిపోదని తేలిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఇషాన్ మెరుపు డబుల్ సెంచరీ సాధించాడు, అయితే ఆ తర్వాత కూడా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి చోటు దక్కలేదు.
ఇషాన్ కిషన్ పరిస్థితి భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ లాగా ఉంటుందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున ట్రిపుల్ సెంచరీ సాధించాడు, అయితే అతను కేవలం 6 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు.
భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్ నాయర్. అతను 7 టెస్టు మ్యాచ్‌లలో 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు. దురదృష్ణవశాత్తూ కరుణ్ నాయర్ ఏ మ్యాచ్‌లో అయితే ట్రిపుల్ సెంచరీ చేశాడో అదే అతను ఆడిన చివరి మ్యాచ్ అయింది. ఆ తర్వాత అతను టీమిండియా తరఫున మరో మ్యాచ్ ఆడలేదు.
ఇషాన్ కిషన్ ఇప్పటివరకు భారత జట్టు తరపున మొత్తం 10 వన్డేలు, 24 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఈ వన్డేల్లో 53 సగటుతో 477 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇది కాకుండా,24 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 27.34 సగటుతో, 127.84 స్ట్రైక్ రేట్‌తో 629 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.