టీమ్‌ఇండియా ప్రదర్శనపై పదేపదే కామెంట్ చేయడం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు అలవాటే! ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో అతనెప్పుడూ కవ్విస్తూనే ఉంటాడు. ఎప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే వాన్ ఈ సారి వసీమ్ జాఫర్‌పై పంచ్ వేసేందుకు ప్రయత్నించాడు. కానీ జాఫర్ భాయ్ ఇచ్చిన రిప్లేతో అతడి దిమ్మ దిరిగిపోయింది!!
ఇక కేప్‌టౌన్ టెస్టులో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), తెంబా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు. ఈ విజయంతో సఫారీ జట్టు 2-1 తేడాతో సిరీసును కైవసం చేసుకుంది.
సిరీసులో టీమ్‌ఇండియా ఓటమి పాలైన వెంటనే మైకేల్ వాన్ ట్విటర్లో వసీమ్ జాఫర్‌ను కదిలించాడు. 'గుడ్ ఈవినింగ్ వసీమ్ జాఫర్! ఏం లేదు.. నువ్వు బానే ఉన్నావో లేదో చెక్ చేస్తున్నా' అని పోస్టు చేశాడు. దీనికి భారత మాజీ ఓపెనర్ జాఫర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. 'హహ..! అంతా బాగానే ఉంది మైకేల్, మేమింకా మీపైన 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నామని మర్చిపోకు' అని బదులిచ్చాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసు తర్వాత కోహ్లీసేన భారత్‌కు తిరిగొచ్చేస్తుంది. శ్రీలంకతో సుదీర్ఘ, పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసులు ఆడుతుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో మ్యాచులుంటాయి. ఇవన్నీ ముగిశాక గతేడాది ఇంగ్లాండ్‌తో వాయిదా పడ్డ ఆఖరి టెస్టును టీమ్‌ఇండియా ఆడనుంది. ఆంగ్లేయుల అడ్డాలో సిరీస్ గెలిచేందుకు భారత్ అడుగు దూరంలో ఉంది. ఐదు టెస్టుల ఈ సిరీసులో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. కరోనా కారణంగా ఆఖరి టెస్టు వాయిదా పడింది. దానిని ఈ ఏడాది ఆడతారు.
Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ
Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!
Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే