Virat Kohli ODI Century: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 74వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇది వన్డేల్లో తనకు 46వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో తను 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
విరాట్ ఏకంగా 117.65 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరంభం నుంచే మంచి రిథమ్‌లో కనిపించాడు. 2023లో అతని బ్యాట్ నుంచి ఇది రెండో సెంచరీ. ఇదే సిరీస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ సాధించాడు. గత నాలుగు వన్డేల్లో ఇది కోహ్లీకి మూడో సెంచరీ.
సచిన్ రికార్డుకు చేరువ
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 49 వన్డే సెంచరీలు సాధించాడు. ఇప్పుడు కోహ్లీ వన్డేల్లో 46వ సెంచరీ సాధించాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే అతనికి ఇప్పుడు కేవలం నాలుగు వన్డే సెంచరీలు మాత్రమే కావాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఉన్న ఫాంను బట్టి 2023 లోనే ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.
2023 సంవత్సరాన్ని విరాట్ కోహ్లీ అద్భుతంగా ప్రారంభించాడు. తన బ్యాట్ నుంచి ఇప్పటి వరకు రెండు సెంచరీలు వచ్చాయి. కోహ్లీ అద్భుతమైన ఫామ్ జట్టుకు చాలా శుభ సంకేతం. దీని తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ల తర్వాత ఈ ఏడాది భారత్ ఆతిథ్యంలో వన్డే ప్రపంచకప్ కూడా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు శుభసూచకం.
టీ20 ప్రపంచకప్ నుంచే టచ్‌లో
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. టోర్నీలో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లలో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడి 296 పరుగులు చేశాడు. ఏకంగా 98.67 సగటు, 136.41 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.