Vedaant Madhavan: మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ పోటీలో అద్భుత ఫలితాలు సాధించాడు. వేదాంత్ మాధవన్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు సహా మొత్తంగా ఏడు పతకాలు సాధించాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మహారాష్ట్ర తరపున వేదాంత్ పాల్గొన్నాడు. ఆర్.మాధవన్ తన కొడుకు సాధించిన ఈ విజయానికి సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అందులో అతను కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు మరి కొందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్. మాధవన్ తన ట్వీట్‌లో ఇలా వ్రాశాడు, "అపేక్ష ఫెర్నాండెజ్, వేదాంత్‌ల ఆటతీరును చూసిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనిని అద్భుతంగా నిర్వహించిందుకు శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చాలా గొప్ప అనుభూతి చెందుతున్నాను. ఈరోజు చాలా గర్వంగా ఉంది."
ఇది కాకుండా తన రెండో ట్వీట్‌లో ఆర్. మాధవన్ కూడా కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన ఫోటోను ట్వీట్ చేసి, “దేవుని దయ వల్ల 100 మీటర్లు, 200 మీటర్లు, 1500 మీటర్లలో స్వర్ణం, 400 మీటర్లు మరియు 800 మీటర్లలో రజత పతకాలు." అని క్యాప్షన్ పెట్టారు.
ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో, మహారాష్ట్ర జట్టు చాలా గొప్ప ప్రదర్శన చేసింది. దీనిపై కూడా ఆర్. మాధవన్ స్పందించారు. రెండు ట్రోఫీలు గెలుచుకున్నందుకు అభినందనలు అని ట్వీట్ చేశారు. స్విమ్మింగ్ టీమ్ ఒక ట్రోఫీ, రెండు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలను గెలుచుకుంది.
స్విమ్మింగ్‌లో వేదాంత్ అద్భుతమైన ప్రదర్శన
వేదాంత్ మాధవన్ గురించి చెప్పాలంటే ఈ 17 ఏళ్ల స్విమ్మర్ ఇప్పటివరకు స్విమ్మింగ్ పోటీలో అద్భుతంగా రాణించాడు. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాలని వేదాంత్ మాధవన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పాడు. 2021లో నటుడు ఆర్.మాధవన్, అతని భార్య సరిత తమ కుమారుడు ఒలింపిక్స్‌కు సిద్ధం కావడానికి దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు.