తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌కు అర్హులు.
కరోనా ప్రభావం వల్ల గత రెండు సంవత్సరాల్లో కనీస మార్కుల నిబంధన నుంచి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండటం, 100 శాతం సిలబస్‌తో అన్ని పరీక్షలు జరుగుతుండటంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వబోమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫిబ్రవరి 11న వెల్లడించారు.
ఇంటర్ మార్కుల వెయిటేజీపై..
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ అమలుపై ఉన్నత విద్యామండలి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వెయిటేజీ అమలు చేయాలా ? వద్దా ? అన్న అంశాన్ని తేల్చాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సర్కారు తుది నిర్ణయం ఆధారంగా వెయిటేజీ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Also Read:
అలా చేరారు, ఇలా వెళ్లిపోయారు - సర్కారు బడుల్లో ప్రవేశాల తీరిది!
కరోనా పరిస్థితుల కారణంగా సర్కారు బడుల్లో ప్రైవేటు బడుల నుంచి వచ్చి చేరిన విద్యార్థులు మళ్లీ తిరుగుబాట పట్టారు. గత విద్యా సంవత్సరం (2021-22) ప్రైవేటు పాఠశాలల నుంచి ఏకంగా 2,78,470 మంది సర్కారు బడుల్లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది వారిలో 1,80,697 మంది పిల్లలు తిరిగి ప్రైవేటు బాట పట్టారు. ప్రభుత్వం ఫిబ్రవరి 10న పాఠశాల విద్యాశాఖ ఫలితాల బడ్జెట్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టింది. అందులో 2020-21, 2021-22, 2022-23 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య, ఇతర గణాంకాలను పొందుపరిచారు. అందులో 1,80,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెనక్కు వెళ్లిన విషయం స్పష్టమైంది. అది 65 శాతంతో సమానం.
పూర్తి వివరాలు ఇలా..
ఏప్రిల్ 12 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పుటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాలల్లో 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 3 - 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతుండటంతో మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..