అల్లు అర్జున్‌ 'పుష్ఫ' విడుదలై చాలా రోజులే అవుతోంది! అయినప్పటికీ ఆ మేనియా తగ్గడమే లేదు! ఇప్పటికే బాలీవుడ్‌ హీరోలు, అంతర్జాతీయ క్రికెటర్లు పుష్ఫ పోస్టర్లను రీక్రియేట్‌ చేశారు. ఆ పాటలకు డ్యాన్సులు చేశారు. వీడియోలతో అలరించారు.


తాజాగా టీమ్‌ఇండియా ఓపెనర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వారితో జత కలిశాడు. 'పుష్ఫ'లా మారాడు. కేఎల్‌ రాహుల్‌ రఫ్‌ లుక్‌లో కనిపిస్తున్న చిత్రాన్ని లక్నో సూపర్‌జెయింట్స్‌ ట్వీట్‌ చేసింది. 'కేఎల్‌ రాహుల్‌.. ఝుకేగా నహీ' అంటూ పేరు పెట్టింది. ట్విటర్లో పోస్టు చేసి కొద్ది సమయంలో ఇది వైరల్‌గా మారింది. అభిమానులు లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. వచ్చే సీజన్లో తాము తగ్గేదే లే అని లక్నో చెప్పకనే చెబుతున్నట్టు అనిపిస్తోంది.


Also Read: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!


దేశవ్యాప్తంగా విడుదలైన పుష్ఫ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌లా క్రికెటర్లు యాక్టింగ్‌ చేస్తున్నారు. రవీంద్ర జడేజా మొదట్లో పుష్ఫలా..  సిగరెట్‌ తాగతూ కనిపించాడు. వెంటనే సిగరెట్‌ తాగొద్దని, అది ప్రమాదకరమని డిస్‌క్లైమర్‌ పెట్టాడు.


ఇక ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పుష్ఫతో వీడియో రూపొందించాడు. అతడి కుమార్తెలు కూడా 'సామి' పాటకు స్టెప్పులేస్తూ అలరించారు. వెస్టిండీస్‌ క్రికెటర్‌ 'డీజే బ్రావో' సైతం 'శ్రీ వల్లి' పాటతో అలరించారు. అహ్మదాబాద్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అయితే ఏకంగా బామ్మతో శ్రీవల్లి స్టెప్పులు వేయించాడు.


Also Read: బీసీసీఐకి, 1983 వరల్డ్ కప్ విజేతలకు లతా మంగేష్కర్ చేసిన గొప్ప సాయం ఏంటో తెలుసా!


గతేడాది పంజాబ్‌ కింగ్స్‌కు సారథ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌ ఈ సారి లక్నో సూపర్‌జెయింట్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. లక్నో రూ.17 కోట్లతో అతడిని తీసుకుంది. రెండు వారాలు విరామం తీసుకున్న రాహుల్‌ తిరిగి టీమ్‌ఇండియా శిబిరంలో కలిశాడు. మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి సాధన చేశాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేకు సిద్ధం అవుతున్నాడు. అతడి రాకతో ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కక పోవచ్చు!