Unmukt Chand Update: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బిగ్‌బాష్ లీగులో ఆడుతున్న తొలి భారత పురుష క్రికెటర్‌గా ఘనత అందుకున్నాడు. మంగళవారం అతడు మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ తరఫున మొదటి మ్యాచ్‌ ఆడాడు. డాక్లాండ్స్‌ స్టేడియంలో హోబర్ట్‌ హరికేన్స్‌పై అతడు అరంగేట్రం చేశాడు.


ఉన్ముక్త్‌ చంద్‌ అద్భుతమైన క్రికెటర్‌. 2012 అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు అతడు సారథ్యం వహించాడు. అత్యధికంగా 246 పరుగులు చేశాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. అద్భుతంగా రాణించినప్పటికీ ఉన్ముక్త్‌ చంద్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. దశాబ్దానికి పైగా దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. 67 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడాడు.






తన కన్నా తక్కువ ప్రతిభావంతులకు జాతీయ జట్టుకు పిలుపు రావడం, తనను ఎంపిక చేయకపోవడంతో ఉన్ముక్త్‌ చంద్‌ గతేడాది అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అమెరికా క్రికెట్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


భారత్‌లోనే ఆడితే ప్రపంచంలోని ఏ లీగ్‌ ఆడేందుకు అనుమతి ఉండదు. అందుకే అతడు ఇక్కడ కెరీర్‌ను వదులుకున్నాడు. దాంతో ఇప్పుడు బిగ్‌బాష్‌ లీగ్‌లో అవకాశం లభించింది. మున్ముందు అతడు సీపీఎల్‌, ది హండ్రెడ్‌ సహా మిగతా లీగులు ఆడే అవకాశం ఉంది.


Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్‌! 


Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్‌ శర్మకు మాత్రం నో ఛాన్స్!


Also Read: Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి