ధోని ట్విట్టర్ అకౌంట్‌కు ట్విట్టర్ బ్లూ టిక్‌ను తీసేసింది.  తీయాల్సిన అవసరం ఏంటని చెప్పలేదు. ఈ కారణంగా మిస్టర్ కూల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కొంతమంది ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండట్లేదని.. చెప్పారు. కానీ ఈ విషయంపై ట్విట్టర్ ఏం స్పందించలేదు. బ్లూ టిక్ తీసేయడంతో ట్విట్టర్ ను ధోని అభిమానులు తెగ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్  ధోని అకౌంట్ కు బ్లూ టిక్ అప్ డేట్ చేసింది.


అసలు ఏం జరిగిందంటే...


భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సామాజిక మాధ్యమాలకు ఎంతో దూరంగా ఉంటాడని అభిమానులకు తెలిసిందే. తాజాగా ధోనీ ( MS Dhoni) ట్విటర్ అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ మార్క్ ను తొలగించింది. అయితే ఎందుకు ఆ బ్లూ క‌ల‌ర్ మార్క్‌ను తొల‌గించారో ఆ సంస్థ వెల్ల‌డించ‌లేదు. 


బ్లూ మార్క్ తీసేసినందుకు ధోనీ అభిమానులు ట్విట్టర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ధోనీ అకౌంట్‌కి ఉన్న బ్లూ టిక్‌ని తొలగించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ట్విట్టర్‌లో ధోనీకి 8.2మిలియన్ ఫాలోయర్లు ఉండగా.. అతను చివరిగా ఈ ఏడాది జనవరి 8న ట్విట్టర్‌లో చివరిగా పోస్ట్ పెట్టాడు.



బ‌హుశా క్రికెట‌ర్ ధోనీ త‌న ట్విటర్లో ఫ్లాట్‌ ఫామ్‌లో యాక్టివ్‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ధోనీ చివ‌రిసారి ఈ ఏడాది జ‌న‌వ‌రి 8న చివరి ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క ట్వీట్ అంటే ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. 
ట్విటర్‌లో ఖాతా ఉన్న వారు ఆరు నెల‌ల పాటు వారి అకౌంట్లో ఒక్కసారి కూడా లాగిన్ కాకపోతే అప్పుడు ట్విటర్ సంస్థ బ్లూ మార్క్ కోసం మరోసారి వెరిఫికేష‌న్ కోరుతుంది. గ‌త ఏడాది ఆగ‌స్టు 15న అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే రోజు సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 



IPLలో చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున ధోనీ ఆడుతున్నాడు. కరోనా కారణంగా వాయిదా ఈ ఏడాది మిగిలిన IPL సీజన్ సెప్టెంబరు 19 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ముంబయి ఇండియన్స్xచెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేడుకగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. 


అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 4,876, వన్డేల్లో 10,773, టీ20ల్లో 1,617 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 224, వన్డేల్లో 183, టీ20ల్లో 56 అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు. టెస్టుల్లో, వన్డేల్లో ధోనీ బౌలింగ్ కూడా చేశాడు. అయితే టెస్టుల్లో ధోనీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. వన్డేల్లో మాత్రం ఒక వికెట్ దక్కింది. 2014లో చివరి టెస్టును ఆడిన ధోనీ 2019లో చివరి వన్డే, టీ20లు ఆడాడు. 


క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ... భార్య సాక్షి, కూతురు జీవాతో సరదాగా గడుపుతున్నాడు. వీలుకుదిరినప్పుడల్లా పలు ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్తున్నాడు.


Also Read: MS Dhoni New Hairstyle: ధోనీ కొత్త హెయిర్ స్టైల్ పై ఓ లుక్కేయండి... నెట్టింట్లో వైరల్