టీమ్‌ఇండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక ఇక లాంఛనమే! కోచ్ పదవికి అతడు బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నాడని తెలిసింది. బోర్డు వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇంతకు ముందే సౌరవ్ గంగూలీ, జే షా మాట్లాడటంతో ఇంటర్వ్యూ నామమాత్రమే కానుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి దిగిపోనున్నాడు. కొన్నేళ్లుగా అతడు జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి కోచింగ్‌లో బాగానే ఆడింది. అతడి వయసు 60 ఏళ్లు కావడంతో కోచ్ పదవికి అర్హుడు కాడు. ఈ నేపథ్యంలో మంచి కోచ్ కోసం బీసీసీఐ గాలించింది. చివరి రాహుల్ ద్రవిడే బెస్ట్ అని నిర్ణయించుకుంది.
మరోవైపు ఎన్‌సీకే చీఫ్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. ఆ పదవిని చేపట్టేందుకు వీవీఎస్ తిరస్కరించినా బీసీసీఐ మాత్రం ఇంకా ఆశాభావంతోనే ఉంది. ద్రవిడ్ తర్వాత చీఫ్ పదవికి అతడే సరైన వాడని భావిస్తోంది. గంగూలీ, జే షా సహా బోర్డు పెద్దలు అతడిని ఒప్పించే పనిలో ఉన్నారని తెలిసింది. ఇదే జరిగితే భారత క్రికెట్ భవిష్యత్తు ఢోకా ఉండదు. 'అవును, ద్రవిడ్ టీమ్‌ఇండియా కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. ఇక ఎన్‌సీఏ చీఫ్ పదవి రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. చర్చలైతే జరుగుతున్నాయి. ఏం జరుగుతుంద చూడాలి' అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
కోచ్ రవిశాస్త్రికి ఏటా రూ.5.5 కోట్లు ఇస్తున్నారు. వాటితో పాటు బోనస్‌లు ఉంటాయి. రాహుల్ ద్రవిడ్‌కు మాత్రం ఏకంగా రూ.10 కోట్ల వేతనం ఇవ్వనున్నారు. బోనస్‌తో పాటు అతడికి మరికొన్ని ప్రయోజనాలనూ కల్పించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోచ్‌లతో పోల్చినా ద్రవిడ్‌కు ఎక్కువే ఇస్తున్నట్టు అర్థమవుతోంది. ఐసీసీ ట్రోఫీల్లో టీమ్‌ఇండియా స్థిరంగా రాణించడమే లక్ష్యంగా ద్రవిడ్‌ను నియమించనున్నారు. వాస్తవంగా పూర్తి స్థాయి కోచ్‌గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించలేదు! మీడియా సమావేశాల్లోనూ ఇలాగే సూచనలు చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జేషా మాత్రం కోచ్‌గా ద్రవిడ్ మాత్రమే ఉండాలని పట్టుబట్టారట. ఎన్నోసార్లు చర్చించి అతడిని ఒప్పించిన సంగతి తెలిసిందే.
Also Read: T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?