టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆస్ట్రేలియన్లను కవ్వించారు! ప్రతిసారీ 'క్రీడా స్ఫూర్తి' గురించి మాట్లాడే కంగారూల ద్వంద్వనీతిని ఎండగట్టారు. పరుష పదజాలం లేకుండానే నోర్లు మూయించారు. ఎలా అంటారా?






ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా తలపడిన సంగతి తెలిసిందే. ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా మహ్మద్ హఫీజ్‌ ఓ బంతి విసిరాడు. పట్టుసరిగ్గా లేకపోవంతో అది షార్ట్‌పిచ్‌లో పడి లెగ్‌సైడ్‌ రెండుసార్లు పిచైంది. సాధారణంగా దానిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. కానీ డేవిడ్‌ వార్నర్‌ తెలివిగా లెగ్‌వైపు రెండుమూడు అడుగులు వేసి సిక్సర్‌గా మలిచాడు. దాంతో అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించి ఫ్రీహిట్‌ ఇవ్వాల్సి వచ్చింది.


కంగారూలు ఎక్కువగా క్రీడాస్ఫూర్తి గురించి పాఠాలు వల్లిస్తుంటారు కదా! జట్టును గెలిపించేందుకు ఎవరైనా మన్కడింగ్‌ చేసినా, నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటితే బంతి వికెట్లకు కొట్టినా క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసినట్టు మాట్లాడతారు కదా! గతంలో అశ్విన్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఇలాగే వ్యాఖ్యాలు చేశారు కదా! అందుకే గంభీర్‌ వారిని తెలివిగా కవ్వించాడు.






'వార్నర్‌ ఘోరమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు! సిగ్గుచేటు! నువ్వేమంటావు రవిచంద్రన్‌ అశ్విన్!' అని ఆ షాట్‌ కొట్టే చిత్రాలను గౌతీ ట్వీట్‌ చేశాడు. దానికి ఆస్ట్రేలియా జర్నలిస్టు పీటర్‌ లాలర్‌ 'తప్పుగా అర్థం చేసుకున్నావు గౌతమ్‌' అంటూ బదులిచ్చాడు. 'ఇది కరెక్టే అయితే అదీ (మన్కడింగ్‌) కరెక్టే. అది తప్పైతే ఇదీ తప్పేనని అతడి (గంభీర్‌) ఉద్దేశం. నిజాయితీగా చెప్పాలి లాలర్‌' అని అశ్విన్‌ రంగంలోకి దిగాడు. 'డేవిడ్‌ వార్నర్‌ తప్పేమీ చేయలేదు. అతడి ముందున్న బంతిని ఆడాడు' అని మరో ట్విటర్‌ యూజర్‌ బదులివ్వగా 'నిజంగానే డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన షాట్‌ ఆడాడు. అది గ్రేట్‌ షాట్‌' అని యాష్‌ సంభాషణ ముగించాడు.


ఐసీసీ నిబంధనల ప్రకారమే ఆడినప్పుడు అనవసరంగా ఇతరుల క్రీడాస్ఫూర్తి గురించి ఎందుకు పాఠాలు చెబుతారని గంభీర్‌, అశ్విన్‌ తెలివిగా కంగారూలకు గుణపాఠం చెప్పారు!!


Also Read: India Tests Squad Against NZ: టీమ్‌ఇండియాలోకి విశాఖ కుర్రాడు.. కివీస్‌ టెస్టు సిరీసుకు భారత జట్టిదే


 Also Read: T20 WC 2021: 4 జట్లతో ఆడుకున్న '6' సెంటిమెంట్‌..! ముందు విజయం సెమీస్‌లో పరాభవం..!


Also Read: Hasan Ali Troll: హసన్‌ అలీకి అండగా భారతీయులు.. పాక్‌ పేసర్‌కు మద్దతుగా #INDwithHasanAli ట్రెండింగ్‌


Also Read: AUS Vs NZ: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!


Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి