Quinton De Kock Pulled Out Vs WI Match: టీ20 ప్రపంచకప్‌ 2021లో  నేడు మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా జట్టు తలపడింది. అనూహ్యంగా మ్యాచ్ కు కొన్ని నిమిషాల ముందు సఫారీ స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. డికాక్ లాంటి ఆటగాడు మ్యాచ్‌కు అందుబాటులో లేడని సఫారీ క్రికెట్ బోర్డు వెల్లడించింది.  దీని వెనుక కారణాలేంటి అని డికాక్ అభిమానులు, దక్షిణాఫ్రికా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు క్వింటన్ డికాక్ తన వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని సఫారీ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వికెట్ కీపర్ బ్యాటర్ డికాక్ స్థానంలో రీజా హెండ్రిక్స్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి 30 నిమిషాల ముందు బోర్డు తీసుకున్న నిర్ణయంతో దక్షిణాఫ్రికా జట్టు ఆశ్చర్యపోయింది. మరో ట్వీట్‌లో.. వ్యక్తిగత కారణాలతోనే విండీస్ తో మ్యాచ్‌కు డికాక్ అందుబాటులో లేడని బోర్డు పేర్కొంది. కానీ అసలు కారణం ఏంటన్నది మ్యాచ్ ముగిసేలోగా తెలిసింది. 


Also Read: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి






టెంబా బవుమా సఫారీ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. డికాక్ స్థానంలో రీజా హెండ్రిక్స్ జట్టులో చేరాడు. అయితే నల్లజాతి వారిపై దాడులు, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా సఫారీ జట్టు మోకాళ్లపై నిల్చుకుని సంఘీభావం తెలపాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. సోమవారం చేసిన ఈ ప్రకటనను పాటించడానికి డికాక్ ఆసక్తి చూపలేదు. తాను మోకాళ్లపై నిల్చుని బ్లాక్ లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపలేనని డికాక్ చెప్పినట్లు సమాచారం. ప్రతి జట్టు మోకాళ్లపై ఉండి సంఘీభావం తెలపడం తెలిసిందే. 


Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?






సఫారీ మేనేజ్ మెంట్ చెప్పినట్లుగా తాను మోకాళ్లపై నిల్చుని మైదానంలో వారికి మద్దతు తెలిపేందుకు నిరాకరించాడు. కానీ బ్లాక్ లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి తాను వ్యతిరేకిని కాదని డికాక్ చెబుతన్నట్లు సమాచారం. కానీ అన్ని జట్లు చేస్తున్నట్లుగా మోకాళ్లపై నిల్చుని సపోర్ట్ చేసేందుకు మాత్రం ఆసక్తి చూపకపోవడంతో తుది జట్టులో చోటు దక్కలేదన్నది అసలు కథ. కానీ ఈ విషయాన్ని డికాక్ గానీ, సఫారీ క్రికెట్ బోర్డు గానీ అధికారికంగా వెల్లడించలేదు. 






కారణం ఇదేనా.. వేటు తప్పదా!
వెస్టిండీస్ తో మ్యాచ్‌లో డికాక్ తప్పుకోవడానికి మోకాళ్లపై నిల్చుని మద్దతు తెలిపేందుకు నిరాకరించడమే కారణమని తెలుస్తోంది. మరోవైపు డికాక్ అభిప్రాయమంటూ ఓ విషయం వైరల్ అవుతోంది. బ్లాక్ లైవ్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరి ప్రాణం (#AllLivesMatter) తనకు విలువైనదని.. అలాంటప్పుడు కేవలం వారిపై దాడులు, వివక్షతకు మాత్రమే వ్యతిరేకించడం కష్టమని డికాక్ వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైతేనేం డికాక్ నిర్ణయంపై సఫారీ బోర్డు గుర్రుగా ఉంది. త్వరలోనే అతడి నిర్ణయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది. టీ20 వరల్డ్ కప్‌లలో మిగతా మ్యాచ్‌లు డికాక్ ఆడతాడో లేదో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.  
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి