T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే 16 జట్లు వార్మప్ మ్యాచులు ఆడనున్నాయి. ఈ మేరకు వీటి షెడ్యూలును ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచులన్నీ బ్రిస్బేన్ మెల్ బోర్న్ లలో మధ్య ఉన్న అన్ని మైదానాలలో జరుగుతాయి. 


సూపర్- 12 దశలో ఉన్న జట్లు అక్టోబర్ 17, 19 తేదీల్లో అన్ని వార్మప్ మ్యాచులను ఆడతాయి. ఈ మ్యాచులు గబ్బా, అలెన్ బోర్డర్ మైదానంలో జరుగుతాయి. మొదటి వార్మపు మ్యాచ్ అక్టోబర్ 10న వెస్టిండీస్, యునైడెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జంక్షన్ ఓవల్ మైదానంలో ఆడుతుంది. మొదటి రౌండ్ జట్లలో ప్రతి జట్టూ రెండు వార్మప్ మ్యాచులు ఆడతాయి. అక్టోబర్ 16న నమీబియాతో శ్రీలంక వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.


అక్టోబర్ 17న గబ్బా వేదికగా భారత్ తో ఆతిథ్య ఆస్ట్రేలియా తన ఏకైక అధికారిక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత అక్టోబర్ 19న భారత్ గబ్బాలోనే న్యూజిలాండ్ తో తలపడుతుంది. 


ఈ వార్మప్ మ్యాచులన్నీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండవు. అయితే అక్టోబర్ 17, 19 తేదీల్లో గబ్బా మైదానంలో జరిగే 4 మ్యాచ్ లను ఐసీసీ గ్లోబల్ బ్రాడ్ కాస్ట్ పార్టనర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐసీసీ డిజిటల్ ఛానల్స్ అన్నింటిలో లైవ్ స్కోర్లు, హైలైట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ మ్యాచులకు అంతర్జాతీయ టీ20 హోదా లేదు. 
 


ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2022 వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ (స్థానిక కాలమానం ప్రకారం)


10 అక్టోబర్ - వెస్టిండీస్ వర్సెస్ యూఏఈ, జంక్షన్ ఓవల్, 11 గంటలకు


10 అక్టోబర్ - స్కాట్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, జంక్షన్ ఓవల్, 3 గంటలకు


10 అక్టోబర్ - శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, ఎంసీజీ, 7 గంటలకు


11 అక్టోబర్ - నమీబియా వర్సెస్ ఐర్లాండ్, ఎంసీజీ, 7 గంటలకు


12 అక్టోబర్ - వెస్టిండీస్ వర్సెస్ నెదర్లాండ్స్, ఎంసీజీ, 7 గంటలకు


13 అక్టోబర్ - జింబాబ్వే వర్సెస్ నమీబియా, జంక్షన్ ఓవల్, 11 గంటలకు


13 అక్టోబర్ - శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, జంక్షన్ ఓవల్, 3 గంటలకు


13 అక్టోబర్ - స్కాట్లాండ్ వర్సెస్ యూఏఈ, ఎంసీజీ, 7 గంటలకు


17 అక్టోబర్ - ఆస్ట్రేలియా వర్సెస్ భారత్, ది గబ్బా, 2 గంటలకు


17 అక్టోబర్ - న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అలన్ బోర్డర్ ఫీల్డ్, 2 గంటలకు


17 అక్టోబర్ - ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్, ది గబ్బా, 6 గంటలకు


17 అక్టోబర్ - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, అలన్ బోర్డర్ ఫీల్డ్, 6 గంటలకు 


19 అక్టోబర్ - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్, ది గబ్బా , 1 గంటకు


19 అక్టోబర్ - బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అలన్ బోర్డర్ ఫీల్డ్,  6 గంటలకు


19 అక్టోబర్ - న్యూజిలాండ్ వర్సెస్ భారత్, ది గబ్బా, 6 గంటలకు