Social Media Reactions On Mayank Agarwal & SRH: దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమించింది. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ అందరి కంటే ముందు ఉన్నాడు.
అయితే టీమ్ మేనేజ్‌మెంట్ దక్షిణాఫ్రికా ఆటగాడు అయిన ఎయిడెన్ మార్క్రమ్‌పై విశ్వాసం ఉంచింది. రంజీ ట్రోఫీ 2023 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్‌లో విజయం సాధించింది. అందుకే ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు ఎయిడెన్ మార్క్రమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమించింది.
టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఫ్యాన్స్ సీరియస్
అదే సమయంలో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు హర్షం వ్యక్తం చేయడం లేదు. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎయిడెన్ మార్క్రమ్‌కు బదులుగా మయాంక్ అగర్వాల్ మెరుగైన కెప్టెన్సీ ఎంపిక అని నమ్ముతున్నారు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేసి ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
డేవిడ్ వార్నర్, కెమ్ విలియమ్సన్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విదేశీ కెప్టెన్ పైనే నమ్మకం ఉంచిందని అభిమానులు అంటున్నారు. అందుకే ఇప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన ఎయిడెన్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా చేసిందని మండి పడుతుంది. ఈ జట్టు విదేశీ కెప్టెన్లను ప్రేమిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
'మయాంక్ అగర్వాల్‌కి అన్యాయం'
దీంతోపాటు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కెప్టెన్ కావడానికి ముందు మూడు సీజన్ల పాటు జట్టులో ఆటగాళ్లుగా ఉన్నారని, అయితే ఎయిడెన్ మార్క్రమ్ కేవలం ఒక్క సీజన్ తర్వాతనే కెప్టెన్‌గా మారారని అభిమానులు అంటున్నారు. అయితే మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్ అగర్వాల్‌ను జట్టుకు కెప్టెన్‌గా చేయలేదు. ఇది భారత ఆటగాడికి జరిగిన అన్యాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.