కొద్ది రోజుల క్రితం ఇంటి EMIలు, తల్లిదండ్రులకు బీమా చేయించేందుకు డబ్బులు లేవని,  గతంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ శ్రీలంక క్రికెటర్లు వారి బోర్డుకు మొర పెట్టుకున్నారు. ఇప్పుడు వారి కష్టాలు కాస్త తగ్గొచ్చు. ఎందుకంటే తాజాగా భారత్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌ల ద్వారా లంక బోర్డుకు బాగానే డబ్బులు వచ్చాయట. దీంతో ఆటగాళ్ల జీతాలు చెల్లించేందుకు అవకాశం ఉంది. 


AlsoRead: IPL 2021: శ్రేయస్ అయ్యర్ ఆగయా... ఇక బ్యాట్‌ మాట్లాడుతుందంటూ ట్వీట్


టీమిండియాతో టెస్టు, వన్డే, టీ20... ఇలా ఏదైనా సిరీస్ నిర్వహించాలని ఏ బోర్డు అయినా ఆసక్తి చూపుతోంది. దీంతో ఆయా బోర్డులకు కాసుల వర్షమే. కొద్ది రోజుల క్రితం భారత్ X శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే, T20 సిరీస్‌లు జరిగాయి. శ్రీలంక వేదికగా ఈ మ్యాచ్‌లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీస్‌లతో లంక బోర్డు సుమారు రూ.107.7కోట్లు వెనకేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆ బోర్డు నష్టాల నుంచి లాభాల బారిన పడినట్లుంది.      






AlsoRead: Neeraj Chopra: నీరజ్ చోప్రాపై వరాల జల్లు... ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేమి ఇస్తామని ప్రకటించారో ఇప్పుడు చూద్దాం


నిజానికి ఇరు జట్ల మధ్య కేవలం మూడు వ‌న్డేల సిరీస్ మాత్ర‌మే జ‌ర‌గాల్సింది. అయితే అక్క‌డి బోర్డు మ‌న బీసీసీఐని అభ్య‌ర్థించి మ‌రో మూడు టీ20ల సిరీస్ ఆడ‌టానికి ఒప్పించింది. ఇది ఆర్థికంగా అక్క‌డి బోర్డుకు బాగా క‌లిసి వ‌చ్చింది. బ్రాడ్‌ కాస్టింగ్‌, ఇత‌ర స్పాన్స‌ర్‌షిప్స్‌తో ఈ భారీ మొత్తం త‌మ‌కు ద‌క్కిన‌ట్లు బోర్డు సెక్ర‌ట‌రీ మోహ‌న్ డిసిల్వా తెలిపారు. ఈ సిరీస్ కోసం తమ దేశానికి వచ్చి, సక్సెస్ చేసినందుకు ఈ సందర్భంగా డిసిల్వా కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమిండియాకు లంక తరఫున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ టూర్‌లో వ‌న్డే సిరీస్ టీమిండియా గెల‌వ‌గా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక గెలుచుకుంది. 


AlsoRead: Neeraj Chopra: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన నీరజ్ చోప్రా... ఏకంగా 14 స్థానాలు ఎగబాకి వరల్డ్ నెంబర్ - 2