టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. జీవిత ప్రయాణంలో అర్ధశతకం అందుకున్న దాదాకు ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతడి ఘనతల్ని గుర్తు చేసుకుంటున్నారు. 2001-02 బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీలో అతడు జట్టును నడిపించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. 2003లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.


'హ్యాపీ బర్త్‌డే దాదా! నువ్వో గొప్ప మిత్రుడివి, ప్రభావం చూపే కెప్టెన్‌వి, ప్రతి కుర్రాడు నిన్ను చూసి నేర్చుకొనేలా చేసిన సీనియర్‌వి. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి' అని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు.






'టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బీసీసీఐ పోస్టు చేసింది.






'గొప్ప నాయకుడైన సౌరవ్‌ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేకమైన రోజున కోరుకుంటున్నా. ఈ ఏడాదంతా బాగుండాలి' అని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు.






'గొప్ప ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు, నా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది అద్భుతంగా సాగాలి. ప్రేమతో భజ్జీ' అని హర్భజన్‌సింగ్‌ ట్వీట్‌ చేశాడు.






'ఒక గొప్ప బ్యాట్స్‌మన్‌ నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగావు. ఇప్పుడు భారత క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తున్నావు. నాకెంతో ఇష్టమైన కెప్టెన్‌, మెంటార్‌ సౌరవ్‌ గంగూలీకి హ్యాపీ బర్త్‌డే' అని మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు.