కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను ఐసీసీ నిర్వహించలేదు. గత ఏడాది వాయిదా పడిన పొట్టి ప్రపంచ కప్‌ను అక్టోబర్‌లో నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఈ క్రమంలో క్రికెట్ జట్లు ఇప్పటికే మార్పులు చేపట్టాయి. కొన్ని జట్ల మెంటార్, కోచ్‌లు టీ20 వరల్డ్ కప్ అనంతరం పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా ఎంఎస్ ధోనీని మెంటార్‌గా నియమించింది.
భారత్ బాటలో శ్రీలంక క్రికెట్ జట్టు సైతం మార్పులకు శ్రీకారం చుట్టింది. మాజీ ఆటగాడు మహేళ జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పగించింది. యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచ కప్‌లో లంక జట్టుకు కన్సల్టెంట్‌గా జయవర్దేను నియమిచింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా సేవలు అందిస్తున్న జయవర్దనే ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే లంక జాతీయ జట్టుతో చేరనున్నాడు.
Also Read: అర్థం లేకుండా కోహ్లీ ఆట.. చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిర్వహించనున్న తొలి రౌండ్ మ్యాచ్‌లలో లంక జట్టుకు మహేళ జయవర్ధనే దిశా నిర్దేశం చేయనున్నాడు. లంక క్రికెట్ జట్టు అక్టోబర్ 16 నుంచి 23 తేదీల మధ్య నమీబియా, ఐర్లాండ్, నెదర్లాండ్ జట్లతో తలపడనుంది. గ్రూప్ స్టేజీకి అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లలో మెరుగ్గా రాణించి నెగ్గాల్సి ఉంటుంది. లంక మేనేజ్ మెంట్ ఆహ్వానాన్ని జయవర్ధనే స్వీకరించాడు. అండర్ 19 జట్టుకు సైతం కన్సల్టెంట్, మెంటార్‌గా సేవలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్ నేపథ్యంలో లంక మేనేజ్‌మెంట్ ఈ బ్యాటింగ్ దిగ్గజం సేవల్ని వినియోగించుకుంటోంది.
Also Read: నటరాజన్ స్థానంలో మరొకరిని తీసుకున్న సన్‌రైజర్స్.. ఎవరో తెలుసా?
లంక సీఈవో ఏమన్నారంటే..
జయవర్ధనేకు సాదర స్వాగతం పలుకుతున్నాను. లంక జట్టుకు, ఆయన క్రికెట్ ఆడుతున్న రోజులనుంచీ జయవర్ధనే ఆటపై ఎంతో నాలెడ్జ్ సంపాదించారు. జాతీయ జట్టు ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా పలు విధాలుగా సేవలు అందించారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా లంక జట్టుకు జయవర్ధనే సేవలు పాజిటివ్‌గా మారుతాయని శ్రీలంక క్రికెట్ జట్టు సీఈవో అశ్లై డిసిల్వా అభిప్రాయపడ్డారు. జయవర్ధనే లంక జట్టుకు 149 టెస్టులు, 448 వన్డేలు, 55 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు.