అక్కినేని అమల సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. కానీ ఎక్కువగా అన్నపూర్ణ స్కూల్ కి సంబంధించిన విషయాలను, ఎన్జీవో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సినిమాలకు సంబంధించి ఆమె చాలా అరుదుగా పోస్ట్ లు పెడుతుంటారు. నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' సినిమా రిలీజ్ సమయంలో మాత్రం సినిమాను ప్రోత్సహిస్తూ ఒకట్రెండు ట్వీట్స్ పెట్టారు. తాజాగా అక్కినేని నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' సినిమాపై ఆమె స్పందించారు.
ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయని.. చైతుకి ఆల్ ది బెస్ట్ చెప్పారు అమల. అలానే ఈ సినిమాను థియేటర్లో చూస్తానని పేర్కొన్నారు. చైతుతో అమలకి స్పెషల్ బాండింగ్ ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రిప్ లకు వెళ్తుంటారు. మొన్నామధ్య అందరూ కలిసి గోవా, మాల్దీవ్స్ అంటూ హాలిడే ఎంజాయ్ చేసి వచ్చారు. చైతు కూడా ఎప్పటికప్పుడు అమలపై తనకున్న గౌరవాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తూ ఉంటాడు.
ఇక 'లవ్ స్టోరీ' సినిమా విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కొన్ని చోట్ల స్లోగా ఉన్నప్పటికీ.. అల్టిమేట్ గా ప్రేక్షకులకు నచ్చడం ఖాయమని అంటున్నారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ సినిమా జోష్ తో మరిన్ని సినిమాలు థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.