Sania Mirza New Instagram Story: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoaib Malik)తో విడాకుల తర్వాత భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) తొలిసారి మహిళల ఆత్మగౌరవం, సాధికారతపై తొలిసారి స్పందించింది. స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై సానియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన యాడ్‌పై తీవ్రంగా స్పందించిన ఆమె.. సోషల్‌మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్న దానిపై అందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓ అర్బన్ కంపెనీ ఇటీవల పరిమిత ఆలోచనల పేరుతో ఓ వీడియో యాడ్ విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుంది. దాన్ని ఇతరులు కూడా గౌరవించాలనే అనే స్ఫూర్తిదాయక సందేశంతో ఆ ప్రకటనను రూపొందించింది.
సానియా భావోద్వేగం
సంకుచిత ఆలోచన పేరుతో రూపొందించిన ఈ వీడియోకు సానియా స్పందిస్తూ ఉద్విగ్నభరిత పోస్ట్ చేశారు. 2005లో డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచానని. అది గొప్పదే కదా..?డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్నప్పుడు.. తాను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదని సానియా అన్నారు. ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదని సానియా భావోద్వేగానికి గురయ్యారు. ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని.. కానీ అది ఎప్పటికి జరుగుతుందో చూడాలని సానియా సూచించారు.
ఆ స్థాయికి చేరుకునేనా
సానియా మీర్జా అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన అనుభవాన్ని, పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నారు. ఆటతో ఎన్నో రికార్డులను, ట్రోఫీలను కైవశం చేసుకున్నారు. అటుంటి క్రీడాకారిణి స్థానాన్ని భర్తీ చేయాలంటే ఎంతో సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం సానియా స్థానాన్ని భర్తీ చేసేందుకు పలువురు క్రీడాకారిణులు పోటీ పడుతున్నారు. కానీ, వారు సానియా స్థాయిలో రాణించగలరా..? లేదా..? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సానియా తరువాత టెన్నిస్‌లో రాణిస్తున్న వారి జాబిలో ఉన్నారు శ్రుతి అహల్వాత్. హర్యానాలోన జజార్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల శృతి.. అద్భుతమైన ప్రతిభతో టెన్నిస్‌లో అదరగొడుతున్నారు. 2022లో మొదటి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ విజయాన్ని నమోదు చేసింది శృతి. అదే ఏడాది సెప్టెంబర్‌లో పూణెలో జరిగిన జూనియర్ ఆసియా/ఓషియన్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి సత్తా చాటింది. జూనియర్ ఆస్ర్టేలియా ఓపెన్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన శృతి భవిష్యత్ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. సానియా తన వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా ఎప్పుడూ గోప్యంగానే ఉంచుతుందని ఈ టెన్నీస్ స్టార్ తరపున ఒక ప్రకటన విడుదలైంది. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు పంచుకోవాల్సి వచ్చిందని... షోయబ్ మాలిక్‌తో కొన్ని నెలల కిందటే సానియా విడాకులు తీసుకుందని సానియా తరపున విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే షోయబ్ కొత్త ప్రయాణం బాగుండాలని కోరుకుంటూ సానియా శుభాకాంక్షలు తెలిపిందని... ఈ సమయంలో సానియా గోప్యతకు అందరూ గౌరవం ఇవ్వాలని కోరుతున్నామని సానియా తరపున ప్రకటన విడుదల చేశారు.